https://oktelugu.com/

PM Svanidhi:వీధి వ్యాపారులకు రూ.20,000. ఈ స్కీమ్ ద్వారా సులువుగా లోన్ తీసుకునే ఛాన్స్!

PM Svanidhi : కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ వ్యాపారులు, వీధి వ్యాపారులకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో పీఎం స్వనిధి స్కీమ్ కూడా ఒకటి కాగా వీధి వ్యాపారులకు ఈ స్కీమ్ ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరనుంది. 2020 సంవత్సరం జూన్ నెల 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ సహాయంతో వ్యాపారులు సులువుగా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 20, 2021 / 06:58 PM IST
    Follow us on

    PM Svanidhi : కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ వ్యాపారులు, వీధి వ్యాపారులకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో పీఎం స్వనిధి స్కీమ్ కూడా ఒకటి కాగా వీధి వ్యాపారులకు ఈ స్కీమ్ ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరనుంది. 2020 సంవత్సరం జూన్ నెల 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.

    ఈ స్కీమ్ సహాయంతో వ్యాపారులు సులువుగా లోన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ స్కీమ్ సహాయంతో వీధి వ్యాపారులు ఆర్థికంగా ఎదిగే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. 2022 సంవత్సరం మార్చి నెల 1వ తేదీ వరకు ఈ స్కీమ్ అమలు కానుంది. అర్హులైన వాళ్లు ఈ స్కీమ్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే ప్రస్తుతం 20,000 రూపాయల వరకు లోన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. గడువులోగా రుణం చెల్లిస్తే వడ్డీ రాయితీని కూడా పొందే అవకాశం ఉంటుంది.

    కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఈ స్కీమ్ కు 7 శాతం సబ్సిడీని అందిస్తోంది. తీసుకున్న రుణం సకాలంలో చెల్లించిన వాళ్లు మరో రుణం పొందడానికి అర్హులు అవుతారని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో రుణదాతలకు వడ్డీరేట్లు మారుతుంటాయి. బ్యాంకులలో వడ్డీరేట్లు ఈ స్కీమ్ విషయంలో అమలులో ఉంటాయి. ఈ స్కీమ్ కింద లోన్ తీసుకున్న వాళ్లు ఈఎంఐ పద్దతుల్లో చెల్లించాలి.

    ఈ స్కీమ్ ద్వారా లోన్ తీసుకున్న వాళ్లకు 7 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. 2024 సంవత్సరం మార్చి 24వ తేదీలోపు ఎలాంటి రుణాలు లేనివాళ్లు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. pmsvanidhi.mohua.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.