జాతీయ ఆహార భద్రతా చట్టం ద్వారా కేంద్రం 80 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరేలా గతేడాది ఈ స్కీమ్ ను మొదలుపెట్టింది. నవంబర్ నెల వరకు ఈ స్కీమ్ అమలు కానుందని తెలుస్తోంది. అయితే దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు తమకు ఉచిత రేషన్ అందడం లేదని ఫిర్యాదు చేస్తుండటం గమనార్హం. ఎక్కువ సంఖ్యలో ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో కేంద్రం లబ్ధిదారులు ఇంటినుంచే ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది.
ఈ స్కీమ్ కింద ప్రతి వ్యక్తి నెలకు ఐదు కిలోల ఉచిత రేషన్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. https://pgportal.gov.in/ వెబ్ సైట్ ద్వారా రేషన్ కు సంబంధించి ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖకు ట్విట్టర్ లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఉచిత రేషన్ అందకపోతే మొదట డీలర్ ను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోవాలి. డీలర్ నుంచి సరైన స్పందన లేకపోతే అధికారులకు ఫిర్యాదు చేయాలి.
జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయానికి వెళ్లి డీలర్ గురించి ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం దేశంలోని పలు ప్రాంతాల్లో బియ్యంకు బదులుగా గోధుమలను పంపిణీ చేస్తోంది.