https://www.rrcpryj.org/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. మొత్తం ఉద్యోగ ఖాళీలలో ప్రయాగ్‌రాజ్ మెకానికల్ డిపార్ట్‌మెంట్ లో 364 ఉద్యోగ ఖాళీలు ఉండగా ప్రయాగ్‌రాజ్ ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ లో 339 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని తెలుస్తోంది.
ఝాన్సీ డివిజన్ లో 480 ఉద్యోగ ఖాళీలు, వర్క్‌షాప్ ఝాన్సీలో 185 ఉద్యోగ ఖాళీలు, ఆగ్రా డివిజన్ లో 296 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పది, ఐటీఐ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. : టెన్త్ క్లాస్, ఐటీఐలో మెరిట్ మార్కులను బట్టి ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది.
ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు. జనరల్ అభ్యర్థులు మాత్రం 100 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి.