Hyderabad : భారతదేశంలో నివాసయోగ్యిత నగరాల్లో హైదరాబాద్ రెండో స్థానాన్ని సాధించిన విషయం తెలిసిందే. సరైన వాతావరణం.. నీటి సౌకర్యం.. పర్యాటక ప్రదేశాలు.. కార్పొరేట్ ఆఫీసులు ఉన్న భాగ్యనగరంలో ఉండడానికి చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాల వారైనా హైదరాబాద్ కే వస్తూ ఉంటారు. ఈ క్రమంలో హైదరాబాద్ ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో ఇక్కడ అద్దె ఇళ్ల ధరలతో పాటు అమ్మకాలు సాగించే ప్లాట్లధరలు చుక్కలనంటుతున్నాయి. ఈ సమయంలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మిడిల్ క్లాస్ పీపుల్స్ కు తక్కువ ధరకు ప్లాట్లు విక్రయించేందుకు ప్రణాళిక వేశారు. కేవలం రూ.30 లక్షలలోపే ప్లాట్ ఇచ్చేందుకు రెడీ చేశారు. ఆ వివరాలేంటో చూద్దాం..
భాగ్యనగరంలోని జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, కొండాపూర్ లాంటి ఏరియాల్లో ప్లాట్లు కొనాలంటే మాములు విషయం కాదు. ఇక్కడ చిన్న స్థలమైనా కోట్ల రూపాయలు ఉంటుంది. ప్రస్తుతం కొండాపూర్, కౌకూర్, కోకాపేట, నల్గగండ్ల, గచ్చబౌలిలు టాప్ 5లో ఉన్నాయి. ఈ తరుణంలో సామాన్యులు ఇక్కడ కొనలేని పరిస్థితి ఉంది. కౌకూర్ లో యావరేజ్ గా చదరపు అడుగు రూ.4,050 ఉంది. గచ్చిబౌలిలో రూ.10,950 పలుకుతోంది. దీంతో సామాన్యులకు సైతం హైదరాబాద్ లో ప్లాట్లు తక్కువ ధరకు ఇచ్చేలా ప్లాన్ చేశాయి. ఈ క్రమంలో కొన్ని హౌసింగ్ సొసైటీలు మిగతా ఏరియాల్లో ఏర్పాటు చేశాయి.
హైదరాబాద్ కు 30 కిలోమీటర్ల లోపు కొన్ని ఏరియాల్లో రూ.30 లక్షల లోపే ప్లాట్ అందించేందుకు వెంచర్లు ఏర్ాపటు చేశారు. మల్లంపేటలో ఉన్న ఓ హౌసింగ్ సొసైటీలోని 975 చదరపు అడుగులకు రూ.30 లక్షల రేటు ఫిక్స్ చేశారు. ఇంతకంటే తక్కువ ప్లాటు కావాలనుకునేవారి కోసం మరో ప్లాటు చదరపు అడుగుకు రూ.2,850తో అమ్ముతున్నారు. ఇక ఓ అపార్ట్మెంట్ ప్లాట్ అయితే రూ.28 లక్షలకే అమ్ముతున్నారు.
హైదరాబాద్ లో లివింగ్ కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది. దీంతో కాస్త దూరంలో వెంచర్లు ఏర్పాటు చేసి తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. అయితే హైదరాద్ శివారు ప్రాంతాల్లో ఉద్యోగం చేసేవారికి ఇది అనుగుణంగా ఉంటుంది. అంతేకాకుండా ఇవి లోన్ సౌకర్యంతో కూడా విక్రయిస్తున్నారు. కొనుగోలుదారుడి డిటేయిల్స్ పరిశీలించిన తరువాత లోన్ సౌకర్యం గురించి చెబుతారు.