Homeట్రెండింగ్ న్యూస్Relationship : మరిదితో వదిన రాసలీలలు.. అతడితోనే బతకాలనుకుంది.. కానీ చివరకు..!?

Relationship : మరిదితో వదిన రాసలీలలు.. అతడితోనే బతకాలనుకుంది.. కానీ చివరకు..!?

Relationship : వివాహేతర సంబంధాలు వైవాహిక జీవితాలనే కాదు.. పెళ్లి కానివారి జీవితాలనూ నాశనం చేస్తున్నాయి. పచ్చని కాపురాల్లో నిప్పులు పోస్తున్నాయి. క్షణిక సుఖం కోసం.. కామ వాంచ తీర్చుకోవడం కోసం వేసే తప్పటడుగుతో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఇలా జరుగుతుందని తెలిసి కూడా ఆవేశం, కామంతో కళ్లు మూసుకుపోయి ఏం చేస్తున్నామో ఆలోచన చేయకపోవడం.. బ్లాక్‌మెయిల్‌ తదితర కారణంలు అనైతిక సంబంధాలకు దారితీస్తున్నాయి. తాజాగా ఓ మహిళ వయసులో తనకంటే 8 ఏళ్లు చిన్నవాడైన మరిదితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. అతడి పెళ్లి కూడా చేసుకోవాలని ఆశపడింది. అయితే ఇది చివరకు తీవ్ర విషాదానికి దారి తీసింది.

పెళ్లికి వచ్చి హత్యకు గురై.. 
రాజస్థాన్‌లోని బిల్వారా జిల్లాలో తన బంధువు పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చిన మైనా కన్వర్‌ అనే మహిళ హత్యకు గురైంది. మే 23వ తేదీన ఇంట్లో నుంచి కనిపించకుండా పోయిన మైనా కన్వర్‌.. మరుసటి రోజు రోడ్డు పక్క పొదల్లో శవమై కనిపించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మైనాను అక్కడే హత్య చేసినట్టుగా గుర్తించారు. అలాగే ఘటన స్థలానికి బైక్‌ వచ్చివెళ్లినట్టుగా ఆనవాళ్లను కనుగొన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.
ఫోన్‌కాల్‌తో గుట్టు రట్టు..
ఈ క్రమంలోనే మైనా కన్వర్‌ కాల్‌ డేటా వివరాలను పోలీసులు బయటకు తీశారు. విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. కన్వర్‌ మే 23వ తేదీ రాత్రి ఫోన్‌ మాట్లాడినట్టుగా గుర్తించారు. ఆ తర్వాత ఇంటి నుంచి వెళ్లిపోయినట్టుగా నిర్దారణకు వచ్చారు. మైనా కాల్‌ వివరాల ఆధారంగా ఆమె మరిది దీపక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. షాకింగ్‌ విషయాలు కూడా బయటపడ్డాయి.
విచారణలో విస్తుపోయే నిజాలు.. 
మైనా కన్వర్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త ముంబైలో పనిచేస్తున్నాడు. పిల్లలు చదువుల కోసం తల్లి ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే మైనాకు, ఆమె మరిది దీపక్‌కు మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. మూడేళ్లుగా ఎలాంటి ఆటంకం లేకుండా వివాహేతర సంబంధం కొనసాగించారు.
పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో.. 
భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నా మైనా కన్వర్‌ మాత్రం మరిదిపైనే మోజు పడింది. భర్తను వదిలేసి మరిదితోనే కలిసి జీవనం సాగించాలనుకుంది. తనకన్నా వయసులో 8 ఏళ్లు చిన్నవాడని తెలిసి కూడా తనే కావాలని కోరుకుంది. ఈమేరకు పెళ్లి చేసుకోవాలని దీపక్‌పై చాలా కాలంగా ఒత్తిడి తెస్తుంది. ఈ విషయమై మే 23వ తేదీ రాత్రి దీపక్, మైనా మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆవేశానికి లోనైన దీపక్‌.. తన వదిన గొంతు నులిమి చంపేశాడు. తర్వాత ఏమీ తెలియనట్లు ఇంటికి వెళ్లిపోయాడు. ఫోన్‌కాల్‌ ఆధారంగా నేరం చేసింది దీపక్‌ అని పోలీసులు నిర్ధారించారు.
Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version