https://oktelugu.com/

Personal Loan : చేతిలో డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్నారా.. ఈ టిప్స్ పాటిస్తే తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్ వస్తుంది  

Personal Loan : పర్సనల్ లోన్ మాత్రమే కాదు మరే లోన్ కావాలన్నా మంచి క్రెడిట్ స్కోర్ తప్పని సరిగా ఉండాలి. అలా మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న వాళ్లకు చాలా బ్యాంకులు తక్కువ వడ్డీకే లోన్లను మంజూరు చేస్తాయి. మీ క్రెడిట్ స్కోర్ 750కంటే ఎక్కువ ఉంటే మిమ్మల్ని బ్యాంకులు నమ్మి రుణాలు ఇస్తుంటాయి.

Written By:
  • Rocky
  • , Updated On : March 12, 2025 / 07:39 PM IST
    Personal Loan

    Personal Loan

    Follow us on

    Personal Loan :ప్రస్తుతం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అవసరాలు పెరిగిపోతున్నాయి కానీ ఉద్యోగుల జీతాలు మాత్రం ఆశించిన మేరకు పెరగడం లేదు. దీంతో మధ్య తరగతి ప్రజలు నెల తిరిగే సరికి ఎక్కడో ఓ చోట అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో పర్సనల్ లోన్స్ కాస్త వాళ్లకు ఉపశమనం కలిగిస్తాయి.అప్పటికి ఏర్పడిన అవసరాలను తీరుస్తున్నాయి. వారి కష్టాలను తాత్కాలికంగా గట్టెక్కిస్తున్నాయి. కాకపోతే పర్సనల్ కావాలంటే ప్రతి ఒక్కరికీ సాధ్యం కాదు. లోన్ కావాలనుకున్న వాళ్లు ముందు వీటిని చెక్ చేసుకోవాలి.

    పర్సనల్ లోన్ మాత్రమే కాదు మరే లోన్ కావాలన్నా మంచి క్రెడిట్ స్కోర్ తప్పని సరిగా ఉండాలి. అలా మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న వాళ్లకు చాలా బ్యాంకులు తక్కువ వడ్డీకే లోన్లను మంజూరు చేస్తాయి. మీ క్రెడిట్ స్కోర్ 750కంటే ఎక్కువ ఉంటే మిమ్మల్ని బ్యాంకులు నమ్మి రుణాలు ఇస్తుంటాయి. కాబట్టి మంచి క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలి అంటే బ్యాంకులు మంజూరు చేసే క్రెడిట్ కార్డుల బిల్లులు, ఇది వరకు తీసుకున్న లోన్లకు ఈఎంఐలకు సకాలంలో చెల్లించాలి. అలాగే క్రెడిట్ కార్డు వినియోగిస్తున్న వాళ్లు కార్డు లిమిట్లో 30శాతం కంటే ఎక్కువ ఉపయోగిచకూడదు. అలా ఉపయోగిస్తే మిమ్మల్ని బ్యాంకులు హంగ్రీ యూజర్లుగా పరిగణిస్తాయి.

    Also Read : ఈఎంఐ భారం తగ్గే సులువైన నాలుగు మార్గాలు.. వెంటనే తెలుసుకోండి
    అలాగే మీ క్రెడిట్ స్కోర్లను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అందులో ఏవైనా లోపాలను గమనిస్తే వెంటనే సరిదిద్దుకోవాలని సూచించారు. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, డిజిటల్ రుణదాతలు తక్కువ వడ్డీ రేట్లకు పలు ఆఫర్లను ప్రకటిస్తాయి. వడ్డీ రేట్లతో పాటు లోన్ తీసుకునే ముందు ప్రాసెసింగ్ ఫీజుల వివరాలను కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. ముందస్తు ఛార్జీలు, దాచుకున్న ఖర్చులను కూడా చెక్ చేయడం మంచింది.

    లోన్ మంజూరైన తర్వాత మీరు ప్రతి నెల ఠంఛన్ గా EMI రూపంలో వాయిదాలను చెల్లించాలి. మీరు ఎక్కువ కాల పరిమితిని ఎంచుకుంటే ఈఎంఐ మొత్తం తక్కువగా ఉంటుంది కానీ వడ్డీ ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. అందుకే సాధ్యమైనంత వరకు మీరు తక్కువ కాల వ్యవధిని ఎంచుకుంటే వడ్డీ రూపంలో మీకు డబ్బు ఆదా అవుతుంది. బ్యాంకులు,నాన్ బ్యాంకింగ్ సంస్థలు లోన్ల పై డిస్కౌంట్లను ప్రకటిస్తుంటాయి. పండుగ సీజన్లు, వివిధ ప్రత్యేక సందర్భాల్లో ఆఫర్లు అమలు చేస్తాయి. మీరు కనుక ఒక ప్రసిద్ధ కంపెనీలో పని చేస్తుంటే మీరు కార్పొరెట్ టై అప్ ద్వారా తక్కువ వడ్డీకి లోన్ తీసుకోవచ్చు.

    లోన్లు తీసుకున్న తర్వాత క్రమం తప్పకుండా చెల్లించే వాళ్లకు బ్యాంకులు ప్రీ అప్రూవ్డ్ లోన్ ఆఫర్లను ప్రకటించి తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను మంజూరు చేస్తుంటాయి. కొంతమంది బ్యాంకులు పర్సనల్ లోన్లు మంజూరు చేస్తున్నప్పుడు బీమా పాలసీలను కూడా విక్రయిస్తుంటారు. ఇలాంటివి మీ ఖర్చును పెంచుతుంటాయి. కాబట్టి లోన్ అగ్రిమెంట్ పై సంతకం చేసేటప్పుడు ప్రతిదీ గమనించాలి. ఫిక్స్ డ్ డిపాజిట్లు, ఇతర ఆస్తుల మీద వడ్డీకే రుణాలు తీసుకోవచ్చు. ఇప్పటికే అధిక వడ్డీ రేటుతో పర్సనల్ లోన్ ఉంటే మీరు దానిని తక్కువ వడ్డీ రేటు వసూలు చేసే మరొక బ్యాంకుకు ట్రాన్సఫర్ చేసుకోవచ్చు. దీనినే బ్యాలెన్స్ ట్రాన్సఫర్ అంటారు.