EMI
EMI: ప్రస్తుత కాలంలో చాలామంది తమ అవసరాలు తీర్చుకోవడానికి బ్యాంకు లోన్ తీసుకుంటున్నారు. గతంలో కంటే ప్రస్తుతం బ్యాంకులో రుణాలను సులభంగా అందిస్తున్నారు. కొన్ని బ్యాంకులు అయితే ఎలాంటి డాక్యుమెంటేషన్ లేకుండా అని డబ్బులు అవసరానికి ఇస్తున్నారు. ఇదే అదనగా తీసుకున్న చాలామంది అవసరానికి మించి రుణాలను తీసుకుంటున్నారు. ఈ రుణాలను తీసుకొని కొన్నాళ్లపాటు సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఆ తర్వాత ఈ అమ్మాయి చేసే సమయంలో మాత్రం అవస్థలు పడుతున్నారు. చాలామంది ఏదో వస్తువు లేదా కొన్ని అవసరాల కోసం రుణాలు తీసుకొని వాటిని తీర్చడానికి మరో అప్పు చేస్తున్నారు. ఇలా శక్తికి మించి అప్పులు చేసి జీవితంపై భారం పడే విధంగా చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి వారి కోసం ఒక నాలుగు మార్గాలు ఎంచుకోవాలి. వీటి ద్వారా ఈఎంఐ భారం లేకుండా చేసుకోవచ్చు. మరి ఆ నాలుగు మార్గాలేవో చూద్దాం..
ఉద్యోగులు లేదా వ్యాపారులకు కొన్ని బ్యాంకులు వివిధ రకాల ఆశలు చూపి రుణాలను అందిస్తూ ఉంటాయి. ఇవి ఆ సమయంలో తక్కువ వడ్డీ అని చెప్పి ఆ తర్వాత రకరకాల కారణాలతో ఎక్కువ వడ్డీని విధిస్తూ ఉంటారు. ఇలా వడ్డీ రేట్లు పెరిగిపోయి ఇలాంటి సెక్యూరిటీ లేకుండా లోన్లు ఇవ్వడం వలన తీసుకున్న లోన్ కంటే ఎక్కువ మొత్తంలో కట్టాల్సి వస్తుంది. దీంతో వచ్చే ఆదాయాన్ని కంటే ఈఎంఐ కట్టడమే ఎక్కువగా మారుతుంది.
ఇలాంటి సమయంలో మొట్టమొదటగా చేయాల్సిన పని జీతాన్ని పెంచుకోవడం. అయితే ఏ కంపెనీ లేదా సంస్థలో పనిచేసే ఉద్యోగి తన జీతాన్ని తానే పెంచుకోలేడు. అయితే ఎక్కువ జీతం ఇచ్చే కంపెనీలోకి మారడం లేదా ఇంక్రిమెంట్ ఎక్కువగా పెరగడానికి కాస్త ఎక్కువగా కష్టపడడం లేదా అదనపు పనులు చేసి ఆదాయాన్ని పెంచుకోవడం చేయాలి. ఇలా వచ్చిన ఆదాయంతో Emi కట్టుకుంటూ పోవాలి. ఇలా చేయడం వల్ల కాస్త భారం తగ్గుతుంది.
మరో మార్గం ఏమిటంటే.. జీతం పెంచే లేదా పెరిగే అవకాశం లేనప్పుడు అదనపు ఆదాయం కోసం మరో పనిని ఎంచుకోవాలి. ఇది పార్ట్ టైం లేదా ఖాళీ సమయాల్లో చేసుకునే విధంగా ఉండాలి. ఇలా చేస్తూ వచ్చే ఆదాయంతో ఈఎంఐ ని కట్టుకోవాలి. లేదా వచ్చే జీతం మొత్తం ఈఎంఐ కి వెళ్లిన అదనపు ఆదాయంతో ఇంటి ఖర్చులతో సరిపెట్టుకోవాలి.
డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని అవసరంలేని కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు. వీటిని కొనుగోలు చేసిన తర్వాత అవి ఎలాంటి ఉపయోగం లేకపోతె వాటిని వెంటనే విక్రయించాలి. వాటిని విక్రయించే వచ్చే ఆదాయంతో లోను క్లియర్ చేసుకోవాలి. ఇలా చేసి ఈఎంఐ భారాన్ని తగ్గించుకోవాలి. అంతేకాకుండా ఒకవేళ ఎక్కువ మొత్తంలో డబ్బు వచ్చినట్లయితే చిన్నచిన్న లోన్లను ఫ్రీ క్లోజెస్ చేసుకోవాలి.
కొన్ని బ్యాంకు రుణాలు సెక్యూర్ గా ఉండలేవు. అంతేకాకుండా ఇవి ఎక్కువ వడ్డీతో కలిగి ఉంటాయి. అయితే తక్కువ వడ్డీ ఇచ్చే లోన్లలో తీసుకొని వీటిని క్లియర్ చేస్తూ ఉండాలి. దీనివల్ల కాస్తంతనైనా భారం తగ్గే అవకాశాలుంటాయి. దీంతో వడ్డీ తగ్గి టెన్యూర్ పెరిగే అవకాశాలుంటాయి.
ఇక చివరిగా ఎలాంటి మార్గాలు లేకపోతే చుట్టాలు లేదా బంధువుల వద్ద వడ్డీ లేకుండా అప్పు ఇచ్చే వారి కోసం చూడండి. ఇలాంటి వారిని రిక్వెస్ట్ చేసి డబ్బులు తీసుకొని ఈ అమ్మాయిని క్లియర్ చేసుకోవాలి. వీలైతే ప్రీక్లోజెస్ లోన్ చేసుకొని బంధువులకు చుట్టాలకు ఆర్థిక పరిస్థితిని చెప్పి మెల్లిగా వారి అప్పులు తీర్చుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల బ్యాంకు రుణం బాధ నుంచి తప్పించుకోవచ్చు.