Pepper Cultivation: మన దేశంలో అన్ని రాష్ట్రాలతో పోలిస్తే కేరళ రాష్ట్రంలో ఎక్కువగా మిరియాలను సాగు చేస్తారనే సంగతి తెలిసిందే. అయితే ఏపీలోని విశాఖ మన్యంలో కూడా మిరియాల పంటను సాగు చేస్తున్నారు. కేరళ మిరియాలకు ఏ మాత్రం తీసిపోకుండా విశాఖ మిరియాలు ఉండటం గమనార్హం. మన్యం మిరియాలు దిగుబడితో పాటు నాణ్యత విషయంలో ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించుకోవడం గమనార్హం.
కాఫీ తోటలలో అంతరపంటగా మిరియాలను సాగు చేయవచ్చు. ఎలాంటి క్రిమి సంహారక మందులు వాడకుండానే మిరియాల సాగు చేయవచ్చు. మన్యం రైతులకు కాఫీ తోటల ద్వారా ఎకరాకు 25,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు ఆదాయం చేకూరుతుండగా మిరియాల పంట ద్వారా 40వేల రూపాయల నుంచి 60,000 రూపాయల వరకు ఆదాయం సమకూరుతుండటం గమనార్హం.
మన్యంలోని గిరిజన రైతులు మిరియాల పంట ద్వారా ఏకంగా 150 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించటం గమనార్హం. మన్యం ప్రాంతం మిరియాల సాగుకు అనుకూలం కావడంతో పాటు అక్కడి గిరిజన రైతులకు మిరియాల సాగు మంచి అవకాశంగా మారింది. విశాఖలోని 98,000 ఎకరాల్లో మిరియాలు అంతర పంటగా సాగవుతోంది. ప్రస్తుతం మార్కెట్ లో కిలో మిరియాల ధర 500 నుండి 700 రూపాయలు పలుకుతోంది.
ఈ ఏడాది విశాఖ మన్యంలో రికార్డు స్థాయిలో 4 వేల మెట్రిక్ టన్నుల మిరియాల దిగుబడి వచ్చినట్టు తెలుస్తోంది. గిరిజన రైతులకు మిరియాల ద్వారా 150 కోట్ల రూపాయల ఆదాయం చేకూరుతోంది. కరియా ముండ, పన్నియూరు1 అనే మిరియాల రకాలను రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. కోజికోడ్ లోని భారత సుగంధ ద్రవ్యాల పరిశోధన సంస్థ నుంచి వేర్వేరు రకాల మొక్కలను తెచ్చి చింతపల్లి నర్సరీల్లో అభివృద్ధి చేస్తుండటం గమనార్హం.