Credit Card : ప్రస్తుత కాలంలో చాలామంది Online Money Transfer కు అలవాటు పడిపోయారు. కూరగాయలు విక్రయించే వారి నుంచి పెద్దపెద్ద వ్యాపారాలు చేసేవారు సైతం ఆన్లైన్లోనే నగదు బదిలీలు చేస్తున్నారు. ఈ ఆర్థిక వ్యవహారాలు జరిపేందుకు మొబైల్ ప్రధాన వాహకంగా ఉంటుంది. ఫోన్లో Phone pay లేదా Google pay తో చెల్లింపులు ఈజీగా ఉండడంతో చాలామంది దీనికి కనెక్ట్ అయిపోయారు. చిల్లర సమస్య ఎదురైనప్పుడు సైతం ఈ యాప్ లను ఉపయోగించుకుంటున్నారు. అయితే ఈ యాప్ లను ఉపయోగించడంలో నియోగదారుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. దీంతో ఫోన్ పే గూగుల్ పే సంస్థలు ఒక్కొక్కటిగా చార్జీలు వసూలు చేస్తున్నాయి. గతంలో కొన్ని బిల్లుల చెల్లింపులో ఎలాంటి చార్జీలు వసూలు చేయని ఇవి ఇప్పుడు ఒక్కొక్కటిగా చార్జీలు వసూలు చేస్తున్నాయి. తాజాగా గూగుల్ పే వినియోగదారులకు భారీ షాక్ తగిలినట్లు అయింది. అదేంటో చూద్దాం..
ఆన్లైన్ చెల్లింపుల్లో ఫోన్ పే కంటే గూగుల్ పేనే ఎక్కువగా వాడేవారు ఉన్నారు. ఎందుకంటే దీనిని ఉపయోగించడం వల్ల కొన్ని రివార్డులను పొందే అవకాశం ఉంది. మర్చంట్ లేదా ఇతర చెల్లింపుల ద్వారా ఎక్కువగా క్యాష్ బ్యాక్ ను పొందే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో గూగుల్ పే గ్యాస్, విద్యుత్ బిల్లుల చెల్లింపులకు ఉచితంగా అవకాశం ఇచ్చింది. అయితే ఆ మధ్య విద్యుత్ చెల్లింపుల కోసం చార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత మొబైల్ రీఛార్జ్ చేసుకోవడంలో కూడా చార్జీలను వసూలు చేస్తూ వస్తుంది.
తాజాగా గూగుల్ పే ద్వారా గ్యాస్ బుక్ చేసే వారికి షాకింగ్ న్యూస్ ను అందించింది. క్రెడిట్ కార్డు ద్వారా గూగుల్ పే నుంచి గ్యాస్ బుక్ చేయాల్సి వస్తే అదనంగా చార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ చార్జీలు 0.5 నుంచి 1 శాతం వరకు ఉండే అవకాశం ఉంది. దీంతో గూగుల్ పే నుంచి క్రెడిట్ కార్డు ద్వారా బిల్లులు చెల్లించేవారు ఇకనుంచి అదనంగా చెల్లించాల్సి వస్తుంది. క్రెడిట్ కార్డు ఉన్నవారు ఇన్నాళ్లు గూగుల్ పే నుంచి కొన్ని బిల్లులు చెల్లించుకునేవారు. కానీ ఇప్పుడు అదనపు రుసుముతో పాటు జీఎస్టీ ని కూడా భరించాల్సి వస్తుంది.
ఇప్పటివరకు ఫోన్ పే లోను ఇలాంటి చార్జీలు వసూలు చేశారని కొందరు ఆరోపించారు. కానీ గ్యాస్ బుక్ చేయడంలో ఎలాంటి చార్జీలు వసూలు చేయలేదు. అయితే ఫోన్ పే లో క్రెడిట్ కార్డ్ ద్వారా ఎలాంటి బిల్లులు చెల్లించిన చార్జీలు వసూలు చేస్తుంది. ఇప్పుడు గూగుల్ పే సైతం క్రెడిట్ కార్డ్ ద్వారా బిల్లులు చెల్లించాల్సి వస్తే చార్జీలు వసూలు చేస్తున్నట్లు తెలుపుతోంది. దీంతో గూగుల్ పే ద్వారా క్రెడిట్ కార్డు ఉపయోగించే బిల్లులు చెల్లించేవారు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. ఇకపై క్రెడిట్ కార్డ్ ఉపయోగించి కాకుండా బ్యాంక్ అకౌంట్ లోని నగదు తో చెల్లించాల్సి వస్తే ఎలాంటి రుసుము వసూలు చేయరు. అయితే ఈ విషయంపై గూగుల్ ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు.