Chiranjeevi , Anil Ravipudi
Chiranjeevi and Anil Ravipudi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్లకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. వాళ్ళు చేసే సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని అలరిస్తూ స్టార్ హీరోలకు సూపర్ సక్సెస్ లను కట్టబెడుతూ ఉంటారు. వెంకటేష్ (Venkatesh) హీరోగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vastunnam) సినిమాతో భారీ విజయాన్ని సాధించాడు. ఇక ఈ సినిమా డైరెక్టర్ అయిన అనిల్ రావిపూడి సైతం ప్రస్తుతం చిరంజీవితో సినిమాను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. చిరంజీవితో ఎలాంటి సినిమా చేస్తున్నాడు అనే విషయాలను ఇంకా స్పష్టంగా తెలియజేయలేదు. కానీ ఈ సినిమాలో మాత్రం చిరంజీవి సూపర్ హిట్ సినిమా అయిన ‘ చంటబ్బాయి’ సినిమాలోని కొన్ని సీన్స్ ని రీ క్రియేట్ చేయాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే చిరంజీవి(Chiranjeevi) లోని మాస్ కామెడీ యాంగిల్ ని పూర్తిస్థాయిలో వాడుకొని ఈ సినిమాని విజయతీరాలకు చేర్చాలని అనిల్ రావిపూడి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అనిల్ అనుకున్నట్టుగానే ఈ సినిమా వస్తుందా చిరంజీవిని భారీగా ఎలివేట్ చేస్తూ ఆయన సినిమా చేయగలడా అది ప్రేక్షకులను మెప్పించగలదా అనే కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి.
మరి మొత్తానికైతే తనకంటూ ఒక స్టార్ డమ్ ను క్రియేట్ చేసుకున్న అనిల్ రావిపూడి ఇప్పటి వరకు చేసిన సినిమాలతో భారీ విజయాలను అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటివరకు ఎనిమిది సినిమాలు చేస్తే 8 సినిమాలతోనూ సూపర్ సక్సెస్ లను అందుకున్న దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఇక చిరంజీవితో సినిమా చేసి మంచి విజయాన్ని సాధించిన దర్శకుడిగా ఒక రికార్డు క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ సైతం 12 సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇక అనిల్ రావిపూడి ఇప్పుడు కూడా రాజమౌళి బాటలో నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఇద్దరు దర్శకులకు ఫ్లాప్ అనేదే తెలియదు. చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ డుపర్ సక్సెస్ సాధిస్తూ ఉండడం విశేషం…ఇక ఇప్పుడు అనిల్ చిరంజీవిని వాడుకొని ఎలాంటి సినిమా చేస్తాడు.
చిరంజీవి పాన్ ఇండియాలో స్టార్ హీరోగా మారడానికి అవకాశం ఉందా లేదా అనే వార్తలైతే వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ ని సాధించిన అనిల్ రావిపూడి చిరంజీవికి సైతం సక్సెస్ ని కట్టబెట్టే ప్రయత్నంలో ఉన్నాడు…