మోడీని కదిలించిన ఆ తల్లి

ఓ తల్లి లేఖ మోడీని కదిలించింది.. కంటతడి పెట్టించింది. కరోనా సృష్టించిన మారణహోమాన్ని కళ్లకు కట్టింది. కరోనా వేళ ఆ తల్లి తీసుకున్న కఠిన నిర్ణయాన్ని అభినందిస్తూ మోడీ లేఖ పంపారు. ఆ లేఖ ఇప్పుడు వైరల్ అయ్యింది. మోడీ గొప్పతనాన్ని చాటిచెప్పింది. కరోనా బారినపడిన ఓ తల్లి తన ఆరేళ్ల కొడుకు కరోనా బారినపడకుండా కఠిన నిర్ణయం తీసుకుంది. ఆమె నుంచి చిన్నారికి వైరస్ సోకకుండా ఉండేందుకు తల్లీ కొడుకులిద్దరూ వేర్వేరు గదుల్లో ఒంటరిగా ఉన్నారు. […]

Written By: NARESH, Updated On : June 16, 2021 7:58 pm
Follow us on

ఓ తల్లి లేఖ మోడీని కదిలించింది.. కంటతడి పెట్టించింది. కరోనా సృష్టించిన మారణహోమాన్ని కళ్లకు కట్టింది. కరోనా వేళ ఆ తల్లి తీసుకున్న కఠిన నిర్ణయాన్ని అభినందిస్తూ మోడీ లేఖ పంపారు. ఆ లేఖ ఇప్పుడు వైరల్ అయ్యింది. మోడీ గొప్పతనాన్ని చాటిచెప్పింది.

కరోనా బారినపడిన ఓ తల్లి తన ఆరేళ్ల కొడుకు కరోనా బారినపడకుండా కఠిన నిర్ణయం తీసుకుంది. ఆమె నుంచి చిన్నారికి వైరస్ సోకకుండా ఉండేందుకు తల్లీ కొడుకులిద్దరూ వేర్వేరు గదుల్లో ఒంటరిగా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్నా ప్రధాని మోడీ ఆ తల్లి కఠిన నిర్ణయాన్ని.. బిడ్డను దూరం అనుభవించిన ఆమె బాధను లేఖ రూపంలో కవితాత్మకంగా చదివి ఎమోషనల్ అయ్యారు. కరోనా వైరస్ పరిస్థితుల్లో చాలా ధైర్యంగా, సానుకూల దృక్ఫథంతో వ్యవహరించి వైరస్ ను జయించారని కొనియాడారు.

ఉత్తరప్రదేశ్ లోని ఘాజియాబాద్ కు చెందిన పూజా వర్మ, తన భర్త గగన్ కౌశిక్ లు తమ ఆరేళ్ల కుమారుడితో ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్నారు. ఇటీవల పూజ, ఆమె భర్త కరోనా బారినపడ్డారు. దీంతో వారిలో ఆందోళన మొదలైంది. తమ కుమారుడిని ఇంట్లో ఎలా ఉంచాలని..అ తడిని కరోనా బారిన పడకుండా ఎలా ఉంచాలని బాగా ఆలోచించి విలవిలలాడిపోయారు. కఠిన నిర్ణయం తీసుకున్న తల్లి పూజ.. పిల్లాడిని ఒక గదిలో,. భార్యాభర్తలు మరో రెండు గదుల్లో వేర్వేరుగా ఉన్నాడు.

ఆరేళ్ల పిల్లాడు ఒంటరిగా ఓ గదిలో ఉండడంతో రాత్రుళ్లు ఏడుస్తూ భయపడుతూ ఉన్నా కూడా తల్లిదండ్రులు దగ్గరకు తీసుకోకుండా ధైర్యంచెప్పారు. తల్లిదండ్రులు తనకు పనిష్ మెంట్ వేశారని ఆ పిల్లాడు ఏడ్చినా దగ్గరకు రానివ్వలేదు. అలా చిన్నారికి కరోనా సోకకుండా తల్లిదండ్రులు కోలుకున్నారు. ఆ చిన్నారిని కాపాడుకున్నారు.

దీంతో ఆ తల్లి హృదయం విలవిలలాడింది. దీన్ని వివరిస్తూ తాజాగా పూజా ప్రధాని మోడీకి ఆ బాధను కవితాత్మకంగా తెలియజేసింది. దీనికి చలించిన ప్రధాని మోడీ వైరస్ తో పోరాడి గెలిచిన మీరు స్ఫూర్తివంతులు అని.. ఎలాంటి సవాళ్లనైనా విజయవంతంగా ఎదుర్కోగలరు అంటూ ప్రత్యుత్తరం పంపారు.