PAN Card: మీకు ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉంటే, జాగ్రత్తగా ఉండండి. నకిలీ పాన్ కార్డులు కలిగి ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం, మీకు అనుకోకుండా లేదంటే కావాలని కానీ మీరు పాన్ కార్డ్ తీసుకుంటే కచ్చితంగా ఆ పాన్ కార్డ్ ను తిరిగి ఇచ్చేయాలని. లేదంటే మీరు రూ. 10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. పాన్ కు సంబంధించిన నిబంధనలలో ఏ మార్పులు చేశారో తెలుసుకుందామా?
Also Read: వెంకటేష్ ‘దృశ్యం 3’ వచ్చేస్తుంది..ఈసారి డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
నియమాలు ఏమిటి?
ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం, ఏ వ్యక్తికీ ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉండకూడదు. ఎవరికైనా డూప్లికేట్ పాన్ కార్డు ఉంటే, వారు దానిని వెంటనే అప్పగించాలి. మీరు ఇలా అప్పగించకపోతే కచ్చితంగా జరిమానాను ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రభుత్వం ఈ సమస్యను తీవ్రంగా పరిగణించింది. డూప్లికేట్ పాన్‌లను గుర్తించడానికి సాంకేతికతను మెరుగుపరుస్తున్నారు.
పాన్ 2.0 పథకం అంటే ఏమిటి?
ప్రభుత్వం ఇటీవలే పాన్ 2.0 పథకాన్ని ఆమోదించింది. ఇది పాన్, టాన్ జారీ, నిర్వహణను సులభతరం చేయడం, ఆధునీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త పథకం ద్వారా ప్రభుత్వం ప్రధాన లక్ష్యం నకిలీ పాన్ కార్డులను తొలగించడం, మోసాలను అరికట్టడం ముఖ్య ఉద్దేశ్యం అంటున్నారు అధికారులు.
మీకు డూప్లికేట్ పాన్ ఉంటే ఏమి చేయాలి?
మీకు ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉంటే, మీరు వాటిని అప్పగించాల్సి ఉంటుంది. ఈ పని NSDL లేదా UTIITSL ద్వారా చేయవచ్చు. దీని కోసం, మీరు అవసరమైన ఫారమ్‌ను పూరించి సమర్పించాలి. కానీ అప్పగించే ముందు, మీ చెల్లుబాటు అయ్యే పాన్ ఆధార్‌తో అనుసంధానించిన, మీ బ్యాంక్ ఖాతా, పన్ను రికార్డులు, పెట్టుబడులకు సంబంధించిన పూర్తి సమాచారం సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి.
ఎంత జరిమానా
మీరు మీ డూప్లికేట్ పాన్‌ను అప్పగించకపోతే, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272B కింద మీరు రూ. 10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఇబ్బందుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, వెంటనే చర్య తీసుకొని అనవసరమైన పాన్ కార్డును అప్పగించండి.
ప్రభుత్వ కఠిన వైఖరి
నకిలీ పాన్ కార్డులు, పాన్ కు సంబంధించిన మోసాలను పూర్తిగా తొలగించాలని ప్రభుత్వం కోరుకుంటోంది. దీని కోసం, ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉన్న సంఘటనలను ఆపడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. మీకు డూప్లికేట్ పాన్ కార్డ్ కూడా ఉంటే, దానిని విస్మరించకండి. సకాలంలో దాన్ని అప్పగించి జరిమానాలను నివారించండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.