CIBIL Score: మీ క్రెడిట్ స్కోర్‌ను పదే పదే చెక్ చేయడం వల్ల మీ CIBIL స్కోరు తగ్గుతుంది అని అనుకుంటున్నారా. మరి ఇది నిజమా? కాదా? అయితే పదే పదే సిబిల్ స్కోర్ ను చెక్ చేస్తే స్కోర్ తగ్గిపోతుంది అనే అపోహ చాలా మందిలో ఉంది. ఇక క్రెడిట్ స్కోర్ తగ్గడానికి చాలా కారణాలు ఉంటాయి. సాధారణంగా, CIBIL స్కోరు తగ్గడానికి కారణం రుణం తిరిగి చెల్లించడంలో ఆలస్యం చేయడమే అంటున్నారు విశ్లేషకులు. మరి స్కోర్‌ను పదే పదే చెక్ చేయడం వల్ల తగ్గుతుందో లేదో తెలుసుకోవడానికి, మీరు మొదట హార్డ్ ఎంక్వైరీ, సాఫ్ట్ ఎంక్వైరీలను అర్థం చేసుకోవాలి. అయితే RBIకి దీనిపై చాలా ఫిర్యాదులు వచ్చాయట. అందువల్ల, RBI దీనికి సంబంధించిన నియమాన్ని మార్చింది. ఇంతకీ ఏంటంటే?
Also Read: వెంకటేష్ ‘దృశ్యం 3’ వచ్చేస్తుంది..ఈసారి డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
సిబిల్ స్కోర్ అనేది మీ క్రెడిట్ హిస్టరీ, క్రెడిట్ అర్హతను ప్రతిబింబించే మూడు అంకెల సంఖ్య. ఈ స్కోరు 300 నుంచి 900 వరకు ఉంటుంది. 750 లేదా అంతకంటే ఎక్కువ స్కోరు ఉంటే అది మీకు మంచి స్కోర్‌గా ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం, ఇప్పుడు కస్టమర్ల CIBIL స్కోర్ ప్రతి 15 రోజులకు ఒకసారి నవీకరిస్తుంటారు. ఈ నియమం జనవరి 1, 2025 నుంచి అమల్లోకి వచ్చింది. RBI ప్రకారం, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇప్పుడు క్రెడిట్ స్కోర్‌ను త్వరగా నవీకరిస్తున్నాయి. అంటే CIBIL స్కోర్‌ను ప్రతి నెల 15వ తేదీన, నెలాఖరులో నవీకరించవచ్చు అన్నమాట.
సాధారణంగా, మీ సిబిల్ స్కోర్‌ను మీరే చెక్ చేసినప్పుడు, దానిని “సాఫ్ట్ ఎంక్వైరీ” అంటారు. సాఫ్ట్ ఎంక్వైరీలు మీ స్కోర్‌ను ప్రభావితం చేయవు. కానీ ఒక బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ మీ క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేసినప్పుడు, దానిని “హార్డ్ ఎంక్వైరీ” అంటారు. హార్డ్ ఎంక్వైరీలు మీ సిబిల్ స్కోర్‌ను కొన్ని పాయింట్లు తగ్గించవచ్చు. ఆర్‌బిఐ ఇటీవల కొన్ని కొత్త నియమాలను అమలు చేసింది, దీని ప్రకారం హార్డ్ ఎంక్వైరీ విచారణ ప్రక్రియలో కొన్ని మార్పులు చేశారు. ఇప్పుడు ఒక బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ మీ క్రెడిట్ చరిత్రను పదే పదే చెక్ చేస్తే, అది మీ స్కోర్‌ను మునుపటి కంటే ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. రుణాలు లేదా క్రెడిట్ కార్డుల కోసం పదే పదే దరఖాస్తు చేసుకునే వారికి ఈ నియమం చాలా ముఖ్యం.
క్రెడిట్ స్కోరు 300, 900 మధ్య నిర్ణయిస్తారు. సాధారణంగా, 750 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోరు మంచి స్కోర్ గా చెబుతారు. క్రెడిట్ స్కోరు పడిపోవడానికి ప్రధాన కారణం నిర్ణీత సమయంలో రుణం తిరిగి చెల్లించకపోవడమే. కానీ ఇది కాకుండా, అనేక ఇతర అంశాలు కూడా మీ స్కోరును ప్రభావితం చేస్తాయి. చెడు క్రెడిట్ వినియోగ నిష్పత్తిని కలిగి ఉండటం, తక్కువ సమయంలోనే అనేకసార్లు రుణం కోసం దరఖాస్తు చేసుకోవడం, సకాలంలో రుణం తిరిగి చెల్లించని వ్యక్తికి రుణ హామీదారుగా మారడం, సకాలంలో క్రెడిట్ కార్డ్ బకాయిలు చెల్లించకపోవడం వంటివి మీ క్రెడిట్ స్కోర్ ను దెబ్బతీస్తాయి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.