ఆదాయపు పన్ను శాఖ ఇ ఫైలింగ్ పోర్టల్ లో పాన్ కార్డుకు సంబంధించిన కొత్త కార్యాచరణను మొదలుపెట్టింది. ఆధార్ నంబర్ ఆధారంగా పాన్ నంబర్ ను పొందే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మాతమే ఈ విధంగా పాన్ కార్డును పొందవచ్చు. గతంలో పాన్ కార్డ్ నంబర్ ను కేటాయించకపోవడంతో పాటు మొబైల్ నంబర్ ను ఆధార్ నంబర్ తో లింక్ చేసి ఉండటం, ఆధార్ కార్డులో పూర్తి పుట్టినతేదీ ఉండటం, పాన్ కోసం దరఖాస్తు చేసిన వ్యక్తి మైనర్ కాకుండా ఉండటం ద్వారా పాన్ కార్డును పొందవచ్చు.
https://www.incometax.gov.in/iec/foportal/ వెబ్ సైట్ లింక్ ను క్లిక్ చేయడం ద్వారా పాన్ కార్డు హోమ్ పేజ్ కు వెళ్లి తక్షణ ఈ పాన్ పై క్లిక్ చేయవచ్చు. ఆ తర్వాత ఆధార్ నంబర్ ను ఎంటర్ చేసి మొబైల్ నంబర్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ వివరాలను, ఈ మెయిల్ ఐడీ వివరాలను ధృవీకరించి ఇ పాన్ డౌన్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా సులువుగా ఇ పాన్ ను పొందవచ్చు.
భౌతిక పాన్ కార్డ్ ఏ విధంగా పని చేస్తుందో ఇ పాన్ కార్డ్ కూడా అదే విధంగా పని చేస్తుంది. ఎటువంటి కాగితాలు లేకుండా సులభంగా ఈ పాన్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది.