Chandrababu Modi Meeting: రాజకీయాల్లో ఒక్కోసారి తప్పటడుగులు వేయడం అనేది సర్వసాధారణం. కానీ దానిని గుర్తించి సరైన మార్గంలోకి రావడమే ప్రధానం. ఇప్పుడు చంద్రబాబు చేసింది అదే. ప్రధాని మోదీతో( Prime Minister Narendra Modi) రాజకీయంగా విభేదించారు. కత్తులు దూశారు. అందుకు మూల్యం చెల్లించుకున్నారు. తిరిగి అదే ప్రధానితో సఖ్యత కుదుర్చుకున్నారు. రాజకీయంగా బలపడ్డారు. అదే ప్రధాని నరేంద్ర మోడీతో నిన్న వేదిక పంచుకున్నారు. అదే వేదికపై ఉన్న నితీష్ కుమార్ సైతం చంద్రబాబు మాదిరిగానే ప్రధానితో విభేదించి దగ్గరయ్యారు. అయితే చంద్రబాబుతో పాటు నితీష్ కుమార్ వ్యవహరించిన తీరు ఇప్పుడు అభినందనలు అందుకుంటుంది. అదే సమయంలో కెసిఆర్ తో పాటు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ప్రస్తావనకు వస్తోంది.
Also Read: పవన్ కళ్యాణ్ ను లెక్కచేయని బిజెపి పెద్దలు!
జగన్మోహన్ రెడ్డికి అవకాశం వచ్చినా..
2019 నుంచి 2024 మధ్య జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy) సైతం ఇదే ఛాన్స్ వచ్చింది. అప్పటికే చంద్రబాబు విభేదించడంతో కేంద్ర పెద్దలు ఆయనపై ఆగ్రహంగా ఉన్నారు. అయితే దానిని రాజకీయంగా వినియోగించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్ర పెద్దలతో పని చేయించుకుందామన్న ఆలోచన రాలేదు. కనీసం బిజెపితో పొత్తు పెట్టుకునే ఆలోచన చేయలేదు. ఎంతవరకు మైనారిటీల ఓటు బ్యాంకు ఆలోచన చేసి బిజెపితో ఉన్న స్నేహాన్ని మరింత ముందుకు తీసుకెళ్లలేకపోయారు. అలాగని బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడలేకపోయారు. ఎస్ బిజెపి తన మిత్రుడు అని బాహటంగా ప్రకటించుకోలేకపోయారు. పొత్తు అవకాశం ఉన్న జగన్మోహన్ రెడ్డి కుదుర్చుకోకపోయేసరికి చంద్రబాబు ఆ అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. కేంద్ర పెద్దలతో ఢీ కొట్టి చేసిన తప్పిదాన్ని సరి చేసుకొని విజయాన్ని అందుకున్నారు. మళ్లీ మోడీ పక్కన సగర్వంగా కూర్చుని అధికారాన్ని వెలగబెడుతున్నారు.
Also Read: పవన్ ఫోటోలు తొలగింపు.. ఎవరి పని?!
చతికిల పడిన కేసీఆర్
తెలుగు నాట ఒక్క చంద్రబాబే( CM Chandrababu) కాదు.. తాను సైతం ఒక జాతీయ నాయకుడిని భావించారు కేసీఆర్. జాతీయస్థాయిలో తాను చక్రం తిప్పగలనని తన స్థాయికి మించి ఆలోచన చేశారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర పెద్దలను ఢీకొట్టారు. సొంత ప్రాంతం తెలంగాణను విడిచి సాము చేశారు. దీంతో తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. జగన్మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టులో ఉండగా.. కెసిఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం అయ్యారు. అంటే ఇటువంటి పరిస్థితికి కచ్చితంగా రాజకీయ నిర్ణయాలే కారణం. దాని నుంచి అధిగమించాల్సిన అవసరం నాయకులపై ఉంది. అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కేసిఆర్ తో పాటు జగన్ పరిస్థితి ఉంది. వారు ఇప్పట్లో గట్టెక్కే అవకాశం లేదని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు.