
ఇద్దరు చిన్నారులను అతికిరాతకంగా హత్య చేశాడు ఓ సైకో. అభం శుభం తెలియని చిన్నారులను వరుసకు బాబాయి అయిన కాటూరి శ్రీనివాసరావు అనే సైకో కర్రతో ఇంట్లో తలుపులు వేసి అతిదారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన రేపల్లెలో సంచలనం కలిగిచింది. రేపల్లలోని నేతాజీ నగర్ లో అమ్మమ్మ వద్దకు వచ్చిన చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామానికి చెందిన కొండేటి కోటేశ్వరరావు ఉమాదేవి దంపుతుల ఇద్దరు కుమారులను కాటూరి శ్రీనివాసరావు అతి దారుణంగా హత్య చేశాడు. నిందితుడు చాలా కాలంగా మానసికపరిస్థితి సరిగా లేదని స్థానికులు తెలిపారు.