https://oktelugu.com/

Pakistan Popular Cars: ఈ కారు భారత్ లో రూ.6 లక్షలు.. పాకిస్థాన్ లో 42 లక్షలు..!

టయోటా కంపెనీ నుంచి రిలీజైన కరోలా అల్టిస్ ఎక్స్ ఇండియాలో రూ.11 లక్షలతో విక్రయిస్తున్నారు. అదే పాకిస్తాన్లో దీనిని 61,69,000లతో అమ్ముతున్నారు. గత మార్చిలో దీనిని 778 యూనిట్లు అమ్మారు.

Written By:
  • Srinivas
  • , Updated On : June 26, 2023 / 12:24 PM IST

    Pakistan Popular Cars

    Follow us on

    Pakistan Popular Cars: భారత్ కు దాయాది దేశమైన పాకిస్థాన్ తో నిత్యం కయ్యం ఉంటుందన్న విషయం తెలిసిందే. రాజకీయాల్లో, క్రికెట్ పరంగా భారత్, పాకిస్థాన్ అంటే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేస్థాయి. పాకిస్థాన్ లో ప్రస్తుతం కరువు తాండవిస్తున్నట్లు వార్తలు చూస్తున్నాం.. నిత్యవసరాలు సైతం వేల రూపాయలు ఉండడంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ కొందరు కార్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఆ కార్లు 20 లక్షలు (పాకిస్తాన్ రూపాయల్లో ) కు పైగానే ఉన్నాయి. ఇండియాలో ఉండే కార్లే పాకిస్థాన్ ఇంత ఎక్కువ ధరకు అమ్ముతున్న ఆ మోడళ్ల గురించి తెలుసుకుందాం.

    మారుతి సుజుకి స్విప్ట్: భారత్ లో స్విఫ్ట్ నెంబర్ స్థానానికి వెళ్లింది. ఇక్కడ అత్యధికంగా అమ్ముడు పోయే కార్లలో స్విఫ్ట్ ఒకటి. ఇక్కడ ఈ కారును రూ.5.99 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు విక్రయిస్తున్నారు. అడ్వాన్స్ డ్ ఫీచర్స్, ఇతర ఎక్స్ ట్రా పార్ట్స్ తో కలిపి ధరలు ఉంటాయి. ఇదే కారు పాకిస్తాన్ లో 42,56,000 పాకిస్తాన్ కరెన్సీల్లో విక్రయిస్తున్నారు. గత మార్చి నెలలో ఈ కార్లు 877 యూనిట్లు అమ్ముడు పోయాయి.

    ఆల్టో: మారుతి నుంచి చిన్న ఫ్యామిలీకి కంపోర్టుగా ఉండే కారు ఆల్టో. ఇండియాలో ఈ కారుపై కూడా చాలా మంది మనసు పారేసుకున్నారు. అయితే దీనికి పాకిస్తాన్ లోనూ ఆదరణ ఉంది. అక్కడ 2003 మార్చిలో 2542 యూనిట్లు అమ్ముడు పోయినట్లు ఆటోమోబైల్ రంగ నిపుణులు తేల్చారు. ఇక ఈ కారు ఇండియాలో రూ.6 లక్షలకు విక్రయిస్తే పాకిస్తాన్ లో 22,51,000తో అమ్ముతున్నారు.

    Hond City:హోండా కంపెనీకి భారత్ లోఆదరణ ఎక్కువ. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన హోండా సిటీ వాహన ప్రియులను ఆకర్షించింది. హోండా సిటీ గత మార్చిలో పాకిస్తాన్ లోనూ 611 యూనిట్లు విక్రయించారు. భారత్ లో దీనిని రూ.11.57 లక్షల నుంచి 16.05 లక్షలకు విక్రయిస్తున్నారు. పాకిస్తాన్ లో దీని ధర పీకేఆర్ : 47,79,000లతో విక్రయిస్తున్నారు.

    టయోటా కరోలా అల్టిస్ ఎక్స్: టయోటా కంపెనీ నుంచి రిలీజైన కరోలా అల్టిస్ ఎక్స్ ఇండియాలో రూ.11 లక్షలతో విక్రయిస్తున్నారు. అదే పాకిస్తాన్లో దీనిని 61,69,000లతో అమ్ముతున్నారు. గత మార్చిలో దీనిని 778 యూనిట్లు అమ్మారు.

    సుజుకీ బోలన్: భారత్ లో వాహన ప్రియులు మెచ్చిన మరో మోడల్ సుజుకి బోలన్. ఇది కాస్త మినీ బస్ ను పోలి ఉంటుంది. దీంతో పాకిస్తాన్ లో చాలా మందిని ఆకర్షించింది. దీనిని పాకిస్తాన్ లో 19,40,000ల పాకిస్తాన్ కరెన్సీలో విక్రయిస్తున్నారు. గత మార్చిలో 782 యూనిట్లు అమ్ముడు పోయాయి.