
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున, కార్తీ హీరోలుగా తెరకెక్కిన ఊపిరి సినిమాలో పెయింటింగ్ సీన్ మనందరికీ గుర్తు ఉంటుంది. ఆ సినిమాలో నాగార్జున 20 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఒక పెయింటింగ్ ను కొనుగోలు చేస్తాడు. మరి రియల్ లైఫ్ లో కూడా పెయింటింగ్ ల కోసం అంత మొత్తం ఖర్చు చేస్తారా..? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. అమెరికాలోని న్యూయార్క్ లో ఒక పెయింటింగ్ 640 కోట్ల రూపాయలకు అమ్ముడైంది.
ప్రపంచంలో అత్యంత ఖరీదైన పెయింటింగ్ ఇదే కావడం గమనార్హం. ఈ పెయింటింగ్ పాతకాలం పెయింటింగ్ కావడం వల్లే ఇంత ధర పలికినట్లు తెలుస్తోంది. ఇటలీకి చెందిన చిత్రకారుడు సాండ్రో బొటిసెల్లి ఈ పెయింటింగ్ ను వేశారు. ఈ పెయింటింగ్ తో పాటు చాలా పెయింటింగ్ లను కూడా వేలంలో పెట్టగా ఈ పెయింటింగ్ ఎక్కువ ధరకు అమ్ముడవడం గమనార్హం. ఈ పెయింటింగ్ 500 సంవత్సరాల క్రితం నాటి పెయింటింగ్ అని తెలుస్తోంది.
క్రీస్తు శకం 1440 – 1510 మధ్య కాలంలో జీవించిన సాండ్రో బొటిసెల్లి అప్పట్లో ప్రఖ్యాత చిత్రకారుడిగా పేరు సంపాదించుకున్నారు. గతంలో కూడా సాండ్రో బొటిసెల్లి పెయింటింగ్స్ ఎక్కువ ధరకు అమ్ముడయ్యాయి. అయితే 640 కోట్ల రూపాయలకు పెయింటింగ్ అమ్ముడవడంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంత ఖరీదు చేసేలా ఆ పెయింటింగ్ అనిపించడం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వేలం నిర్వాహకులు సాండ్రో బొటిసెల్లి ఎన్నో అద్భుతమైన పెయింటింగ్స్ వేశాడని అయితే అతని పెయింటింగ్స్ అన్నిటిలో ఇదే అత్యధిక ధర పలికీందని తెలిపారు.