ఏ మూహూర్తాన ఏపీ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ గద్దెనెక్కాడో కానీ అప్పటి నుంచి ఏపీ ప్రభుత్వాన్ని నిమ్మగడ్డ ఉచ్చపోయించేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న నిమ్మగడ్డ పంచాయితీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇక చెలరేగిపోతున్నారు.
తాజాగా ఏపీ మంత్రులకు, సలహాదారులకు నిమ్మగడ్డ గట్టి షాకిచ్చారు. వారందరికీ ప్రభుత్వ వాహనాలు కట్ చేశారు. ఎన్నికల కోడ్ ఉన్నందున మంత్రులు, సలహాదారులు ప్రభుత్వ వాహనాలు వినియోగించరాదని ఆంక్షలు విధించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పూర్తిగా అమలు చేయాలని సీఎస్ కు సూచించారు.
ఎన్నికల నియమావళి ప్రకారం మంత్రులు, సలహాదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎమ్మెల్యేలు కూడా వస్తారని లేఖలో నిమ్మగడ్డ ప్రస్తావించారు.దీంతో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. తమ హక్కులను కాలరాయడంపై దుమ్మెత్తిపోస్తున్నారు.
ఇప్పటికే ప్రభుత్వం జారీ చేసే సర్టిఫికెట్లలో జగన్ ఫొటో తీసేయాలని నిమ్మగడ్డ ఆదేశించడం పెద్ద వివాదాస్పదమైంది. ఇక జిల్లాలు పర్యటించి అక్కడ మరిన్ని వివాదాలకు నిమ్మగడ్డ కారణమవుతున్నారు. ఇక ప్రతీదానికి గవర్నర్ కు, సీఎస్ కు లేఖలు రాస్తూ కాకలు రేపుతున్నారు. తాజాగా ఏకంగా మంత్రులు, సలహాదారులకు షాకిచ్చి వాహనాలు కట్ చేయించారు. ఇక మంత్రులు పర్యటనల్లోనూ అధికారులు, ఉద్యోగులు పాల్గొనరాదని సీఎస్ కు లేఖ రాశారు.