https://oktelugu.com/

ఆస్ట్రేలియా జట్టులో విభేదాలు.. కోచ్ లాంగర్ పై ఆటగాళ్ల గుస్సా

టీమిండియాతో టెస్ట్ సిరీస్ కోల్పోయాక ఆస్ట్రేలియా జట్టుపై తీవ్రవిమర్శలు వస్తున్నాయి. ఆ జట్టు ఆటగాళ్ల మధ్య గొడవలు, లొల్లిలు, ఇతర వివాదాలన్నీ బయటపడుతున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ తో పలువురు ఆటగాళ్లకు విభేదాలు ఏర్పడినట్టు అక్కడి ప్రముఖ వార్త సంస్థల్లో వార్తలు బయటపడడం ఆస్ట్రేలియా జట్టును షేక్ చేస్తోంది. ఆస్ట్రేలియా కోచ్ లాంగర్ ఆటగాళ్లతో అతిగా ప్రవర్తించాడని.. అస్సలు స్వేచ్ఛను ఇవ్వలేదని.. కోచ్ వ్యవహారశైలితో ఆటగాళ్లు ఇబ్బందులు పడుతున్నారి.. జట్టు ఆటగాళ్లతో లాంగర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 30, 2021 6:24 pm
    Follow us on

    టీమిండియాతో టెస్ట్ సిరీస్ కోల్పోయాక ఆస్ట్రేలియా జట్టుపై తీవ్రవిమర్శలు వస్తున్నాయి. ఆ జట్టు ఆటగాళ్ల మధ్య గొడవలు, లొల్లిలు, ఇతర వివాదాలన్నీ బయటపడుతున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ తో పలువురు ఆటగాళ్లకు విభేదాలు ఏర్పడినట్టు అక్కడి ప్రముఖ వార్త సంస్థల్లో వార్తలు బయటపడడం ఆస్ట్రేలియా జట్టును షేక్ చేస్తోంది.

    ఆస్ట్రేలియా కోచ్ లాంగర్ ఆటగాళ్లతో అతిగా ప్రవర్తించాడని.. అస్సలు స్వేచ్ఛను ఇవ్వలేదని.. కోచ్ వ్యవహారశైలితో ఆటగాళ్లు ఇబ్బందులు పడుతున్నారి.. జట్టు ఆటగాళ్లతో లాంగర్ సరిగా వ్యవహరించలేదని ఆ కథనంలో పేర్కొన్నారు.

    కొందరు సీనియర్ ఆటగాళ్లు కూడా లాంగర్ పట్ల అసంతృప్తితో ఉన్నారని రాసుకొచ్చారు. ఎప్పుడూ ఆటగాళ్ల తిండి విషయంలో లాంగర్ నిఘా పెడుతుంటాడని ఆటగాళ్లు సీరియస్ అయ్యారని పేర్కొన్నారు.

    ఇక బౌలింగ్ వ్యవహారాల్లో కూడా తలదూర్చి వారిపై ఆధిపత్యం ప్రదర్శించాడని.. వారిపై కన్నేసాడని కూడా ఆటగాళ్లు ఫిర్యాదు చేశారని సమాచారం.

    ఇక గబ్బా టెస్టులో ఆకలితో ఓ ఆటగాడు సాండ్ విచ్ ను జేబులో పెట్టుకొని వెళితే కోచ్ లాంగర్ హెచ్చరించాడని.. అది ప్రజల్లోకి వెళ్లి జట్టు పరువు పోతుందని ఆటగాడిని నిలదీసినట్లు పత్రిక కథనంలో పేర్కొన్నారు.

    ఇలా కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు ఇప్పుడు ఆస్ట్రేలియా ఓటమితో ఆ జట్టులోని ఒక్కో కారణం కూడా బయటపడుతోంది.