మనలో చాలామంది సొంతంగా కష్టపడి డబ్బు సంపాదించాలని అనుకుంటారు. అయితే ఆర్థికంగా స్వతంత్రంగా నిలబడాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుందని చెప్పవచ్చు. ఉన్నత చదువులు చదివిన మహిళలు వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారాలు చేయడం సులభం కాదనే సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ ప్రాంతానికి చెందిన యువతి పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఉద్యోగాన్ని కోల్పోయింది.
ఆ యువతి ఆ తర్వాత రోజుల్లో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. ఆ తర్వాత యూట్యూబ్ ద్వారా వర్మీ కంపోస్ట్ తయారీ విధానాన్ని నేర్చుకుని ఆ వర్మీ కంపోస్ట్ ను దేశవ్యాప్తంగా సరఫరా చేస్తూ వ్యాపారంను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఆ యువతి పేరు పూజా యాదవ్ కాగా వెబ్ డిజైనర్ ఉద్యోగంను వదిలి సదరు మహిళ వర్మీ కంపోస్ట్ బిజినెస్ ను మొదలుపెట్టారు. పూజా యాదవ్ రైతులకు సైతం వర్మీ కంపోస్ట్ తయారీకి సంబంధించి శిక్షణ ఇస్తున్నారు.
వర్మీ కంపోస్ట్ తయారీ ద్వారా నెలకు 50,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తం సంపాదిస్తున్నారు. ముంబైలో ఆరు సంవత్సరాలు ఉద్యోగం చేసిన పూజా యాదవ్ అనారోగ్య సమస్యల వల్ల ఇండోర్ కు తిరిగి వచ్చారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడంతో ఆమె ఉద్యోగానికి దూరమయ్యారు. ఆ తర్వాత వర్మీ కంపోస్ట్ వ్యాపారాన్ని ఆమె మొదలుపెట్టారు. రెండు సంవత్సరాలలోనే 13 లక్షల రూపాయల వ్యాపారం జరిగిందని పూజా యాదవ్ అన్నారు.
www.agriclinics.net వెబ్ సైట్ ద్వారా వర్మీ కంపోస్ట్ తయారీ, శిక్షణకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందాలని భావించే వాళ్లకు ఈ వ్యాపారం ఉత్తమమని చెప్పవచ్చు.