Homeబిజినెస్Oppo Reno 16: అదరగొట్టే కెమెరా.. భారీ బ్యాటరీ.. ఒప్పో సంచలమైన ఫోన్..

Oppo Reno 16: అదరగొట్టే కెమెరా.. భారీ బ్యాటరీ.. ఒప్పో సంచలమైన ఫోన్..

Oppo Reno 16: ఫొటోగ్రఫీలో అదరగొట్టే మొబైల్స్ ఏవంటే Oppo కంపెనీ గురించి కొందరు ప్రత్యేకంగా చెబుతారు. అయితే ఈ కంపెనీ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ ను మార్కెట్లోకి తీసుకువస్తుంది. ఇందులో భాగంగా లేటేస్ట్ గా సరికొత్త మోడల్ ఒప్పో రెనో 16 (Oppo Reno 16)ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ప్రీమియం మిడ్ రేంజ్ విభాగంలో లాంచ్ అయిన ఈ ఫోన్ కాంపాక్ట్ డిజైన్‌తో పాటు, కెమెరా పరంగా వినియోగదారులను ఆకట్టుకునే దాదాపు అన్ని ఫీచర్లను పక్కాగా బ్యాలెన్స్ చేసిందని ‘గిజ్మోచైనా’ చెబుతోంది. మరి ఈ స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూద్దాం..

ఒప్పో రెనో 16 ఫోన్ ప్రధానంగా చేతిలో పట్టుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది కేవలం 6.32 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. భారీ స్క్రీన్లు నచ్చని వారికి, సింగిల్ హ్యాండ్‌తో సులభంగా వాడాలనుకునే వారికి ఈ సైజ్ పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. 1.5K రిజల్యూషన్ తో 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న ఇందులో ఏకంగా 3,600 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో వచ్చే ఈ స్క్రీన్ ఉండనుంది. దీంతో ఎలాంటి వాతావరణంలోనైనా స్పష్టమైన విజువల్స్ అందిస్తుంది. అంతేకాదు దీనికి క్రిస్టల్ గార్డ్ ప్రొటెక్షన్ తో పాటు IP69K రేటింగ్ ఇవ్వడం వల్ల దుమ్ము, నీటి నుంచి ఫోన్‌కు గట్టి రక్షణ లభిస్తుంది.

ఒప్పో ఫోన్ల అనగానే కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చ. ఈ కొత్త ఫోన్‌ను ఒక పవర్‌ఫుల్ కెమెరా ఫోన్‌గా గిజ్మోచైనా అభివర్ణించింది. దీని వెనుక భాగంలో మూడు 50 మెగాపిక్సెల్ కెమెరాలను అమర్చారు. అందులో 50MP ప్రధాన కెమెరా, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్, ఆప్టికల్ జూమ్ అందించే 50MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.

Oppo Reno 16 స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 8GB ర్యామ్128GB స్టోరేజ్ తో పాటు 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. రోజువారీ మల్టీటాస్కింగ్, బ్రౌజింగ్, వీడియో స్ట్రీమింగ్, మోడరేట్ గేమింగ్‌ను ఎటువంటి లాగ్ లేదా హీటింగ్ సమస్యలు లేకుండా చాలా స్మూత్‌గా హ్యాండిల్ చేస్తుందని రివ్యూలో పేర్కొన్నారు.

ఇందులో సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ ఓఎస్ 16 పై రన్ అవుతుంది. ఇందులో ఫోటో ఎడిటింగ్, ఉత్పాదకతను పెంచేందుకు వీలుగా ఎన్నో స్మార్ట్ AI ఫీచర్లను జోడించారు. ముఖ్యంగా ఫోటోలలోని అనవసరమైన వస్తువులను తొలగించడానికి, బ్లర్ అయిన ఇమేజ్‌లను క్లియర్ చేయడానికి, మరియు రాత్రి వేళల్లో తక్కువ కాంతిలో కూడా క్లారిటీతో కూడిన చిత్రాలను ప్రాసెస్ చేయడానికి ఇందులోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఎంతో ఉపయోగపడతాయి.

కాంపాక్ట్ సైజ్ ఫోన్ అయినప్పటికీ, ఒప్పో ఇందులో ఏమాత్రం తగ్గకుండా 6,700mAh బ్యాటరీని ప్యాక్ చేసింది. ఇది సాధారణ వినియోగదారులకు ఒకటిన్నర నుండి రెండు రోజుల పాటు సులభంగా బ్యాకప్ ఇస్తుంది. ఈ బ్యాటరీకి 80W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల చాలా తక్కువ సమయంలోనే ఫోన్ పూర్తిగా చార్జ్ అవుతుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular