Oneplus Realme merger news: కార్పొరేట్ కంపెనీలు విలీనం కావడం కొత్తేమీ కాదు. విలీనమైన తర్వాత రకరకాల విధానాలను కంపెనీలు తీసుకొస్తాయి. ఆ విధానాలకు అనుగుణంగా యూజర్లు నడుచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో రియల్ మీ కంపెనీలో వన్ ప్లస్ కంపెనీ విలినమైంది. ఈ నేపథ్యంలో వన్ ప్లస్ కంపెనీ ఫోన్ వాడే యూజర్లు ఎటువంటి మార్పులకు గురవుతారో ఈ కథనంలో తెలుసుకుందాం.
వన్ ప్లస్ చైనాకు సంబంధించిన మొబైల్ తయారీ కంపెనీ. వన్ ప్లస్ రియల్ మీలో విలీనమైంది. ఒప్పో కంపెనీకి సబ్ బ్రాండ్ గా రియల్ మీ కంపెనీ వ్యవహరిస్తోంది. ఇవన్నీ కూడా బీబీకే ఎలక్ట్రానిక్స్ గ్రూపులో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకే సంస్థ కింద పనిచేస్తాయి. ఖర్చును తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చైనా మీడియాలో వార్తలు వస్తున్నాయి.
చైనా మీడియా ఇటీవల రియల్ మీ లో వన్ ప్లస్ విలీనం అయిందని బయటపెట్టింది. చైనా మాత్రమే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా వన్ ప్లస్ రియల్ మీలో విలీనం అయింది. కొత్త బృందాలకు ఒప్పో కంపెనీ ముఖ్య ఉత్పత్తుల అధికారి, వన్ ప్లస్ వ్యవస్థాపకుడు పీట్ లౌ సారథ్యం వహిస్తారు.. కొత్త ఉత్పత్తులను తీ రెండు కంపెనీలు తయారు చేస్తాయి. దీనివల్ల ఖర్చులు చాలా వరకు తగ్గుతాయని తెలుస్తోంది.. విలీనం అనంతరం వన్ ప్లస్, రియల్ మీ బ్రాండ్ లు వాటి సొంత పేర్లతోనే మార్కెట్లోకి వస్తాయి. యూజర్లకు గతంలో మాదిరిగానే సేవలు లభిస్తాయి.
మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం ఈ ఏడాది జనవరిలో వన్ ప్లస్ సేవలు ఆగిపోతాయని ప్రచారం జరిగింది. మన దేశంలో ఉన్న యూసర్లు కూడా ఆందోళనలో పడ్డారు. అయితే రూమర్లకు వన్ ప్లస్ సి ఈ ఓ రాబిన్ ఖండించారు. ఏడాది మార్చిలో రాబిన్ వన్ ప్లస్ సంస్థ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత కూడా వన్ ప్లస్ సేవలపై రకరకాల రూమర్లు వినిపించాయి. అయితే ఆ తర్వాత ఈ కంపెనీ సేవలు మన దేశంలో కొనసాగుతూనే వచ్చాయి. అంతేకాదు, వన్ ప్లస్ కంపెనీ తన సర్వీస్ సెంటర్ నెట్వర్క్ మొత్తాన్ని 50 శాతం వరకు పెంచింది.. రియల్ మీలో విలీనం అయినప్పటికీ.. ఈ సర్వీస్ సెంటర్లు కొనసాగుతాయని తెలుస్తోంది.