Independence Day Big Deal: శ్రావణ మాసం ప్రారంభమైంది. ఇక పండుగల సీజన్ మొదలైనట్లే. మొన్నటి వరకు ఆషాఢం మాసం కొనసాగింది. ఆ సందర్భంగా కొన్ని సంస్థలు వస్తువులు, దుస్తులపై భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి. అయితే ఇప్పుడు శ్రావణ మాసంలో పండుగలు ఎక్కువగా వస్తున్నందున కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఆఫర్లు ప్రకటిస్తాయి. భారీ డిస్కౌంట్ ను ప్రకటించి సేల్స్ ను పెంచుకుంటాయి. ఇదే సమయంలో ఆన్ లైన్ ఈ కామర్స్ సంస్థలైన ఫ్లిప్ కార్డ్, అమెజాన్ సంస్థలు సైతం మంచి ఆఫర్లను ప్రకటిస్తాయి. శ్రావణ మాసంలోనే ఇండిపెండెన్స్ డే వస్తుంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజున ప్రత్యేకంగా సెలబ్రేషన్ చేసుకుంటాం. అయితే దీనిని దృష్టిలో ఉంచుకొన్ని కొన్ని కంపెనీలు ప్రతీ ఏడాది ఈ సమయంలో భారీ ఆఫర్స్ ప్రకటిస్తూ వస్తాయి.ఈ ఏడాది కూడా ఈ కామర్స్ సంస్థలైన ఆమెజాన్, ఫ్లిప్ కార్డు సంస్థలు కళ్లు చెదిరే ఆఫర్లు ప్రకటించాయి. ఆన్ లైన్ లో షాపింగ్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది మంచి డీల్ అని అంటున్నారు. అయితే ఇందులో చాలా వరకు వస్తువులపై ఆఫర్లను ప్రకటించారు. కానీ ఏ వస్తువు ఎక్కడ ఉందో వెతుక్కోవడం కష్టం. అందువల్ల టెలిగ్రామ్ యాప్ లో ఈ ఆఫర్స్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. ఇందులోప్రత్యేకంగా ఒక ఛానల్ ఉంచి అందులో ఆఫర్ల గురించి తెలియజేస్తున్నారు. లేటేస్టుగా ఇండిపెండెన్స్ డే సందర్భంగా కొన్ని ఆఫర్స్ ప్రకటించాయి. వీటితో పాటు హిడ్డెన్ సేల్స్ వివరాలు అందజేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తామా..
Independence Day సందర్భంగా ఆమెజాన్, ఫ్లిప్ కార్డు భారీ ఆఫర్లు ప్రకటించాయి. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివెల్ , ఫ్లిప్ కార్ట్ ‘ఫ్లాష్ షిప్’ పేరుతో డిస్కంట్లను అందిస్తోంది. ఈ డీల్ ఆగస్టు 6 నుంచి ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఆమెజాన్ లో మొబైల్స్ కొనుగోలు చేయాలంటే 40 శాతం, టీవీలు కొనుగోలు చేయాలంటే 65 శాతం, ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు కొనుగోలు చేయాలంటే 80 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇవే ఆఫర్లు ఫ్లిప్ కార్డులో కూడా పొందవచ్చు. ఇవి మాత్రమే కాకుండా డెబిట్, క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేసేవారికి మరింత తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ వివరా గురించి పూర్తిగా తెలియాలంటే టెలిగ్రామ్ యాప్ లో వివిధ చానెల్స్ ఉంటాయి. ఈ ఛానెల్స్ లో ఆఫర్ల గురించి తెలియజేస్తారు. ఏ వస్తువుపై ఎంత ఆఫర్ ప్రకటిస్తున్నారో.. ఆ వస్తువు ఎంతకు కొనుగోలు చేయొచ్చో.. ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
ప్రస్తుతం పండుగల సీజన్. ఇదే నెలలో శుభకార్యాలు ఎక్కువగా సాగనున్నాయి. అలాగే పెళ్లిళ్లకు కూడా మంచిముహూర్తాలు ఉన్నట్లు కొందరు పండితులు తెలుపుతున్నారు. దీంతో కొన్ని వస్తువులు నేరుగా కాకుండా ఆన్ లైన్ లో కొనుగోలు చేయడం వల్ల లాభం ఉండే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఆమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలు ఆఫర్లు ప్రకటించిన నేపథ్యంలో అవసరమున్న వస్తువులు కొనుగోలు చేయడం వల్ల చాలా వరకు డబ్బు ఆదా అవుతుంది.
ఈ రకమైన ఆఫర్లు మాత్రమే కాకుండా ఒక్కోసారి కంపెనీలు హిడ్డెన్ సేల్స్ చేస్తుంటాయి.అంటే కొన్ని వస్తువులపై ఆఫర్లను రోజుల వ్యవధితోనే ఇస్తుంటాయి. ఇలాంటి వస్తువులను చేజిక్కించుకోవాలంటే టెలిగ్రామ్ ఆఫర్స్ కు సంబంధించిన ఛానెల్స్ లో జాయిన్ అయితే తెలుసుకోవచ్చు. అయితే అన్నీ లింక్స్ జెన్యూ అని అనుకోకుండా జాగ్రత్తగా లింక్ ను క్లిక్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా మంచి ఆఫర్లు ప్రకటించినప్పుడు వస్తువులను కొనుగోలు చేసి డబ్బును ఆదా చేసుకోండి..