https://oktelugu.com/

Ola Electric Share Price: ఫ్లాట్‌గా ప్రారంభమైన ఓలా ఎలక్ట్రిక్‌ షేర్‌.. ఇష్యూ ధర రూ.76 వద్ద ట్రేడింగ్‌..

ఇటీవలో పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లిన ఓలా.. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజి(ఎన్‌ఎస్‌ఈ)లో లిస్ట్‌ అయింది. షేరు ధర రూ.76 గా ప్లాట్‌గా లిస్ట్‌ అయింది. తర్వాత 15 శాతానికిపైగా లాభపడింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 9, 2024 / 03:12 PM IST

    Ola Electric Share Price

    Follow us on

    Ola Electric Share Price: ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ ఓటా ఇటీవలే పబ్లిక్‌ ఇష్యూలోకి వెళ్లింది. ఆగస్టు 2–6 మధ్య ఐపీవో కొనసాగింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌లో లిస్ట్‌ అయింది. ఈ క్రమంలో ఐపీవో స్టాక్‌ మార్కెట్‌ మదుపర్లలో ఆసక్తి చేకెత్తించింది. ఒక్కో షేరుకు రూ.72 నుంచి రూ.76గా నిర్ణయించారు. మదుపరులు రూ.14,972 తో కంపెనీ 197 షేర్లకు బిల్డు దాఖలు చేశారు. అర్హత గల కంపెనీ ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ.7 రాయితీ ఇచ్చింది. ఐపీవో ద్వారా కంపెనీకి లభించే నిధుల్లో రూ.1,227.6 కోట్లను సెల మానుఫ్యాక్చరింగ్‌ ప్లాంట్‌ సామర్థ్యాన్ని 5 గిగావాట్ల నుంచి 6.4 గిగావాట్లకు పెంచడానికి కేటాయిస్తామని కంపెనీ తెలిపింది. పరిశోధన – అభివృద్ధి కార్యకలాపాలకు రూ.1,600 కోట్లు వెచ్చిస్తామని తెలిపింది. అప్పులు తీర్చడానికి రూ.800 కోట్లు, వృద్ధి అవకాశాల కోసం రూ.350 కోట్లు కేటాయించనున్నట్లు పేర్కొంది. ఐపీవోకి ముందే యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీరూ.2,763 కోట్లు సమీకరించింది. ఇతర ఐపీవోలతో ఓలిస్తే ఓలా ఎలక్ట్రిక్‌ ఐపీవో పెట్టుబడిదారుల నుండి మోస్తరు స్పందనను అందుకుంది. ఎన్‌ఎస్‌ఈలో సబ్‌స్క్రిప్షన్‌ డేటా ప్రకారం, ఆఫర్‌పై 46.51 కోట్ల షేర్లకు వ్యతిరేకంగా 198.79 కోట్ల ఈక్విటీ షేర్లకు బిడ్లు అందుకోవడంతో ఇష్యూ మొత్తం 4.27 రెట్లు సబ్‌స్క్రయిబ్‌ చేయబడింది. పబ్లిక్‌ ఇష్యూ రిటైల్‌ ఇండివిజువల్‌ ఇన్వెస్టర్స్‌ కేటగిరీలో 3.92 సార్లు, నాన్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్స్‌ కేటగిరీలో 2.40 సార్లు బుక్‌ చేయబడింది. క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ కొనుగోలుదారులు 5.31 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను పొందింది.

    2021లో తొలి స్కూటర్‌..
    ఓలా ఎలక్ట్రిక్‌ తన తొలి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను 2021 డిసెంబర్‌లో కస్టమర్లకు అందించింది. పెద్ద ఎత్తున స్కూటర్లను తయారు చేస్తున్న ఈ కంపెనీ ప్రస్తుతానికి నష్టాల్లో కొనసాగుతోంది 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.1,584.4 కోట్ల నష్టాలు ఉన్నట్లు నివేదించింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం మాత్రం 90 శాతం పెరిగి రూ.5,009.8 కోట్లకు చేరింది. గత ఆర్థిక ఏడాది ముగిసే నాటికి భారత విద్యుత్‌ బైక్‌ల మార్కెట్‌లో ఓటా ఎలక్ట్రిక్‌దే 35 శాతం వాటా అని కంపెనీ తెలిపింది.

    విభాగాల ఉత్పత్తి..
    ఇదిలా ఉంటే ఓలా ఎలక్ట్రిక్‌ వాహనాలతోపాటు విద్యుత్‌ వాహనాలలో ఉపయోగించే ప్రధాన విడిభాగాలను తయారు చేస్తోంది. కంపెనీ ఓలా ఫ్యూచర్‌ ఫ్యాక్టరీలో బ్యారటీ ప్యాక్‌లు, మోటార్లు, వాహన ఫ్రేమ్‌లు తయారవుతాయి. ఇప్పటి వరకు ఓలా నాలుగు స్కూటర్లను తీసుకొచ్చింది. మరో ఆరింటి కోసం ప్రణాళికలు ప్రకటించింది. వారి తొలి మోడల్‌ ఓలా ఎస్‌1 ప్రో 2021 డిసెంబర్‌లో కస్టమర్లకు డెలివరి అయింది. ఆ తర్వాత ఓలా ఎస్‌1, ఓలా ఎస్‌1 ఎయిర్, ఓలా ఎస్‌1 ఎక్స్‌ప్లస్‌ వంతి మోడళ్లు కూడా వచ్చాయి. 2023 ఆగస్టు 15న ఓలా ఎస్‌1 ఎక్స్‌(2కెడబ్ల్యూహెచ్‌), ఓలా ఎస్‌1 ఎక్‌(3 కేడబ్ల్యూహెచ్‌) కొత్త మోడళ్లతోపటు డైమండ్‌ హెడ్, అడ్వెంచర్, రోడ్‌ స్టర్, క్రూజర్‌ వంటి మోటార్‌ సైకిళ్ల లైనప్‌ను ప్రకటించింది. వీటి డెలివరీలు 2.25, 2026 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమవుతాయని తెలిపింది.