Ola Electric : ఓలా ఎలక్ట్రిక్‌కు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎలక్ట్రిక్ స్కూటర్ల క్వాలిటీ, సర్వీస్ లేట్ వంటి సమస్యలతో నిరంతరం విమర్శలు ఎదుర్కొంటున్న ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు ఏకంగా 40కి పైగా స్టోర్లను మూసివేయవలసి వచ్చింది. కొన్ని నెలల క్రితమే ఓలా ఎలక్ట్రిక్ ఒకేసారి 4,000 స్టోర్లను తెరిచి కొత్త రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో ఆర్టీఓ ఓలా ఎలక్ట్రిక్‌కు స్టోర్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. కంపెనీ ఈ స్టోర్లలో ట్రేడ్ సర్టిఫికేట్ లేకుండానే ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. వాటికి సర్వీస్ అందిస్తోంది. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటూ ఓలా ఎలక్ట్రిక్‌ను స్టోర్లను మూసివేయమని ఆదేశించారు.
Also Read : కర్వ్డ్ డిస్‌ప్లే, పవర్ ఫుల్ ప్రాసెసర్! వివో T4 5G స్పెషాలిటీ ఇదే !
మూతపడిన 43 స్టోర్లు
ట్రేడ్ సర్టిఫికేట్ లేకుండా వ్యాపారం చేస్తున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ స్టోర్లను మూసివేయాలని వివిధ ఆర్టీఓల పరిధిలోని ప్రాంతాలకు మహారాష్ట్ర ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. మహారాష్ట్రలో ట్రేడ్ సర్టిఫికేట్ లేని 107 ఓలా స్కూటర్ స్టోర్లను గుర్తించారు. వీటిలో 43 స్టోర్లను ఇప్పటికే మూసివేశారు. మరో 64 స్టోర్లకు ఒక రోజు నోటీసు ఇచ్చి మూసివేయాలని ఆదేశించారు.
జప్తు చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్లు
మహారాష్ట్రలో ఆర్టీఓ ఇప్పటివరకు ఓలాకు చెందిన 131 స్టోర్లను చెక్ చేసింది. ఈ స్టోర్లలో ఉన్న దాదాపు 214 ఎలక్ట్రిక్ స్కూటర్లను జప్తు చేశారు. అయితే, ఓలా ఎలక్ట్రిక్ ప్రతినిధి ఈ వార్తలను ఖండించారు. అలాగే, కంపెనీ అధికారులు సమస్యను పరిష్కరించడానికి వారితో సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు.
అయితే, ఓలా ఇంతకు ముందు కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల లోపాల గురించి చాలా మంది వినియోగదారులు ఫిర్యాదు చేశారు. అలాగే, కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్, హాస్యనటుడు కునాల్ కామ్రా మధ్య ‘ఎక్స్’లో తీవ్రమైన వాగ్వాదం కూడా చోటుచేసుకుంది.
Also Read : స్పీడ్, రేంజ్, ధర.. ఓలా ఎస్1 ప్రో+ వర్సెస్ హీరో విడా వి2 ప్రో..ఏది బెస్ట్ ?