https://oktelugu.com/

ట్రంప్ ఓటమికి.. మోడీకి లింకెంటీ?

అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరపున రెండోసారి పోటీ చేస్తున్నాడు. ట్రంప్ కు ప్రత్యర్థిగా డెమొక్రాటిక్ నుంచి జో బైడెన్ పోటీ చేశాడు. హోరాహోరిగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ మ్యాజిక్ ఫిగర్ దక్కించుకుండగా ట్రంప్ మాత్రం వెనుకపడ్డాడు. ట్రంప్ ఓటమి ఖాయమైన నేపథ్యంలో ఇన్నాళ్లు ఆయనను భుజాన మోసిన బీజేపీ తాజాగా ప్లేట్ ఫిరాయిస్తోంది. మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్ నరేంద్ర […]

Written By:
  • NARESH
  • , Updated On : November 6, 2020 / 06:52 PM IST
    Follow us on

    అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరపున రెండోసారి పోటీ చేస్తున్నాడు. ట్రంప్ కు ప్రత్యర్థిగా డెమొక్రాటిక్ నుంచి జో బైడెన్ పోటీ చేశాడు. హోరాహోరిగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ మ్యాజిక్ ఫిగర్ దక్కించుకుండగా ట్రంప్ మాత్రం వెనుకపడ్డాడు. ట్రంప్ ఓటమి ఖాయమైన నేపథ్యంలో ఇన్నాళ్లు ఆయనను భుజాన మోసిన బీజేపీ తాజాగా ప్లేట్ ఫిరాయిస్తోంది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

    నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాని అయినప్పటి నుంచి ట్రంప్ విధానాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ రెండోసారి కూడా గెలుస్తాడని మోదీ భావించారు. ఆ కారణంగానే ట్రంప్ కు అనుకూలంగా మద్దతు ప్రకటించారు. ట్రంప్ సైతం భారత ప్రధాని నరేంద్రమోడీతో ‘హౌడీ మోడీ’ అంటూ ఇండో అమెరికన్లను ఆకర్షించే ప్రయత్నం చేశాడు. మోడీ ప్రచారం ట్రంప్ కు కలిసిస్తుందని అందరూ భావించారు.

    Also Read: అమెరికాది పురాతన ప్రజాస్వామ్యం.. అందుకే ఈ గందరగోళం

    అయితే ట్రంప్ ఓటమికి కరోనా ఎఫెక్ట్ బలంగా పని చేసినట్లు కన్పిస్తోంది. కరోనా కట్టడిలో ట్రంప్ విఫలం కావడం అధ్యక్ష ఎన్నికల్లో ప్రభావం చూపినట్లు కన్పిస్తోంది. అధ్యక్ష ఎన్నికల్లో దాదాపుగా ట్రంప్ ఓటమి కావడంతో దీనిని కూడా బీజేపీ పెద్దలు తమకు అనుకూలంగా వాడుకుంటుడటం చర్చనీయాంశంగా మారింది.

    బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తాజాగా ట్రంప్ పై హాట్ కామెంట్స్ చేశాడు. బీహార్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న జేపీ నడ్డా మాట్లాడుతూ కరోనా నియంత్రణలో ట్రంప్ సరిగా పని చేయలేదని.. కానీ ప్రధాని మోడీ సరైన సమయంలో నిర్ణయాలు తీసుకొని దేశ ప్రజలను కరోనా నుంచి కాపాడారని కొనియాడారు. రెండుమూడేళ్లుగా మోదీ బ్యాచ్ ట్రంప్ ను విపరీతంగా వాడుకొని ఆయన ఎన్నికల్లో ఓడిపోతున్నారని తెలియగానే విమర్శలు గుప్పించడం ఆసక్తిని రేపుతోంది.

    Also Read: ఆ తప్పులే ట్రంప్‌ ఓటమికి కారణమా?

    కరోనా కట్టడిలో మోదీ సైతం విఫలమయ్యారని.. ఇక్కడ కూడా ఎన్నికలు జరిగితే మోదీ కూడా ఓడిపోయేవారనే కామెంట్స్ విన్పిస్తున్నాయి. ఏదిఏమైనా ఏరు దాటగానే తెప్ప తగిలేసినట్లు బీజేపీ పెద్దలు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. మోదీ డియరెస్ట్ ఫ్రెండ్ ట్రంప్ ఓటమిపై ప్రధాని ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే..!