Odisha Farmer Sudama Sahu: మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం అనే విషయం తెలిసిందే. గ్రామాలలో చాలామంది వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయం ద్వారా భారీ మొత్తంలో డబ్బులు సంపాదించుకునే అవకాశాలు ఉంటాయి. కృషి, పట్టుదలతో వ్యవసాయం చేయడం ద్వారా మంచి లాభాలను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒడిశాలోని బార్ఖడ్ జిల్లాకు చెందిన సుదామ సాహు అనే రైతు ఒకరు వ్యవసాయం ద్వారా లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు.
బాల్యంలోనే వేర్వేరు కారణాల వల్ల సుదామ సాహు కుటుంబ బాధ్యతలను తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 12వ తరగతి చదివిన సుదామా సాహు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందాడు. అయితే కొన్ని కారణాల వల్ల సుదామా సాహు ఆ ఉద్యోగాన్ని వదిలేయాల్సి వచ్చింది. మొదట ఊరూరా తిరిగి సుదామా సాహు విత్తనాలను సేకరించగా సుదామ సాహు ఆ పనిని ఎక్కువ కాలం చేయలేకపోయారు.
ఆ తరువాత మహారాష్ట్ర రాష్ట్రంలోని వార్ధా ప్రాంతానికి వెళ్లి అక్కడ సుదామ సాహు విత్తన బ్యాంకు ఏర్పాటు, విత్తనాలను ఆదా చేయడం గురించి శిక్షణ తీసుకున్నారు. వరి రకాలు, పప్పు రకాలకు చెందిన విత్తన బ్యాంకులను సుదామ సాహు ఎక్కువగా ఏర్పాటు చేశారు. సుదామ సాహు విత్తనాలు ఇతర దేశాలకు సైతం ఎగుమతి అవుతున్నాయి. సుదామ సాహు వార్షిక టర్నోవర్ 40 లక్షల రూపాయలు కావడం గమనార్హం.
ప్రస్తుతం సుదామ సాహు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి వ్యవసాయం గురించి, విత్తనాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసిన సాహు వ్యాపారాల ద్వారా భారీ లాభాలను సొంతం చేసుకోవడం గమనార్హం.