https://oktelugu.com/

Gopichand: తప్పు చేశానని ఫీల్ అవుతున్న యాక్షన్ హీరో !

Gopichand: యాక్షన్ హీరో గోపీచంద్ కి(Gopichand) ఒక హిట్ వచ్చిందంటే.. వరుసగా నాలుగు ప్లాప్ లు రావడం ఆనవాయితీ అయిపోయింది. ఆ ఆనవాయితీని బ్రేక్ చేయడానికి దర్శకుడు సంపత్ నందితో కలిసి ‘సిటీమార్’ అంటూ ఒక సినిమా తీశాడు. అయినా సంపత్‌ నందికే హిట్ లేదు, ఇక గోపిచంద్ కి ఏం హిట్ ఇస్తాడు అని విమర్శకులు కామెంట్స్ చేసినట్టుగానే ఆ సినిమా ప్లాప్ అయింది. హిట్ ఇస్తా అని నమ్మకంగా చెప్పిన సంపత్ నంది చివరకు […]

Written By:
  • admin
  • , Updated On : September 14, 2021 / 12:01 PM IST
    Follow us on

    Gopichand: యాక్షన్ హీరో గోపీచంద్ కి(Gopichand) ఒక హిట్ వచ్చిందంటే.. వరుసగా నాలుగు ప్లాప్ లు రావడం ఆనవాయితీ అయిపోయింది. ఆ ఆనవాయితీని బ్రేక్ చేయడానికి దర్శకుడు సంపత్ నందితో కలిసి ‘సిటీమార్’ అంటూ ఒక సినిమా తీశాడు. అయినా సంపత్‌ నందికే హిట్ లేదు, ఇక గోపిచంద్ కి ఏం హిట్ ఇస్తాడు అని విమర్శకులు కామెంట్స్ చేసినట్టుగానే ఆ సినిమా ప్లాప్ అయింది.

    హిట్ ఇస్తా అని నమ్మకంగా చెప్పిన సంపత్ నంది చివరకు డిజాస్టర్ ఇచ్చాడు. ఇక ఎప్పటిలాగే యాక్షన్ హీరో గోపీచంద్‌ వరుస డిజాస్టర్ల పరంపరను కొనసాగించాడు. అయితే, ఓటమి వల్ల చాలా కోల్పోతాం గాని, నిజానికి ఆ ఓటమే మనకు చాలా నేర్పిస్తోంది. సిటీమార్ రిజల్ట్ తో గోపీచంద్‌ లో చాలా మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది.

    మాస్ హీరో అనే మోజులో పడి కథల ఎంపికలో తప్పు చేశాను అని ఫీల్ అవుతున్నాడు గోపీచంద్. అందుకే, ఇప్పుడు యాక్షన్ అంటేనే ఓవర్ గా వద్దు అంటున్నాడు. మరి గోపీచంద్ ఇప్పుడు ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుంది? కచ్చితంగా చెప్పొచ్చు గోపీచంద్ మంచి నటుడు. కాబట్టి నటుడిగా స్కోప్ ఉన్న పాత్రలు చేయాలి.

    కేవలం కథానాయకుడిగానే కాకుండా పాత్ర బాగుంది అనుకుంటే ప్రతినాయకునిగా కూడా నటించాలి. నిజానికి గోపీచంద్ కెరీర్ ఇప్పటివరకు కొనసాగింది అంటే.. కెరీర్ మొదట్లో చేసిన విలన్ పాత్రలే కారణం. గోపీచంద్ ముఖంలో ప్రతి నాయకునికి ఉండవలసిన తీవ్రత, క్రౌర్యం బాగా పలుకుతాయి.

    అలాగే మూస కథలను వదిలేసి గతంలో చేసిన ‘ఒక్కడున్నాడు, సాహసం లాంటి సినిమాల శైలిలోనే మిగిలిన సినిమాలను ప్లాన్ చేసుకుంటే కనీసం నటుడిగా నైనా గోపీచంద్ కి కాలం కలిసి వస్తోంది.