Nokia Lumia: ఒకప్పుడు టిక్‌టాక్ ధ్వనితో ప్రపంచాన్ని ఆకట్టుకున్న నోకియా ఆన్‌డ్రాయిడ్ ఫోన్ విభాగంలో ఆశించిన ఫలితాలు సాధించడం లేదు. సాధారణ ఫోన్ల తయాలలో ప్రపంచ మార్కెట్‌ను ఒక ఊపు ఊపింది. కానీ ఆన్‌డ్రాయిడ్ తయారీతో కస్టమర్లను ఆకట్టుకోవడం లేదు. తాజాగా లూమియా సిరీస్ పేరుతో స్మార్ట్‌ఫోన్ ప్రియుల మనసులో ముందుంచుకుంది. ఇప్పుడు 5జీ యుగంలో అత్యాధునిక స్పెస్‌లతో లూమియా 400x 5జీను ప్రవేశపెట్టి పూర్వ వైభవం తెచ్చుకోవాలని భావిస్తోంది.
ప్రీమియం డిజైన్, డిస్‌ప్లే
6.7 అంగుళాల AMOLED స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో మెరుగైన విజువల్స్‌ను అందిస్తుంది. ఎండలో కూడా స్పష్టమైన వీక్షణకు అనుకూలం. ఫ్లాగ్‌షిప్ లెవల్ బిల్డ్ క్వాలిటీ దీన్ని ఆకర్షణీయంగా మారుస్తుంది.
సూపర్ కెమెరా..
వెనుక 200 ఎంపీ ప్రధాన సెన్సార్, 50 ఎంపీ అల్ట్రా–వైడ్, 25 ఎంపీ డెప్త్ లెన్స్‌లతో అసాధారణ క్వాలిటీతో, ముందు 50 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4కె వీడియోలకు సపోర్ట్ చేస్తుంది. కంటెంట్ క్రియేటర్లకు ఇది ఆదర్శ ఎంపిక.
5000 ఎంఏహెచ్ బ్యాటరీ..
స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 12 జీబీ రామ్‌తో గేమింగ్, మల్టీటాస్కింగ్ సరళంగా సాగుతాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 80 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 35 నిమిషాల్లో పూర్తి చార్జ్ అవుతుంది. వైర్‌లెస్ ఛార్జింగ్ బోనస్ ఫీచర్.
ధర ఇలా..
రూ.25 వేలలోపు ధరలో ఆగస్టు–సెప్టెంబర్‌లో విడుదల అయ్యే అవకాశం. బడ్జెట్‌లో ఫ్లాగ్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వారికి ఇది బలమైన ఎంపిక. మొత్తంగా కొత్త మోడల్‌తో మార్కెట్‌లో మళ్లీ పుంజుకుంటామని నోటికా ఆశాభావంతో ఉంది.