Nissan Magnite SUV : లో బడ్జెట్లో SUV కారు.. మైలేజ్ చూస్తే మతిపోతుంది..

భారత్ లో నిస్సాన్ కంపెనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. 2020లో ఎంట్రీ ఇచ్చిన ఈ కంపెనీ ఇప్పటి వరకు వివిధ మోడళ్లను మార్కెట్లో లాంచ్ చేసింది. వీటిలో మాగ్నైట్ పాపులారిటీ సాధించింది. అయితే ఈ మోడల్ ఫేస్ లిప్ట్ ను అక్టోబర్ 4న మార్కెట్లోకి తీసుకొచ్చారు. దీని ధర, ఫీచర్లు చూసి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.

Written By: Srinivas, Updated On : October 5, 2024 5:33 pm

Nissan Magnite SUV

Follow us on

Nissan Magnite SUV : ప్రస్తుతం దేశంలో SUV కార్ల హవా సాగుతోంది. చాలా మంది కార్లకు ఉన్న ప్రత్యేకతలను గుర్తించి వీటిని కొనుగోలు చేసేందుక ఆసక్తి చూపుతున్నారు. అయితే ఎస్ యూవీ కార్ల ధరలు మిగతా వాటికంటే ఎక్కువగా ఉంటాయి. దీంతో కొంత మంది అధిక ధరలను చూసి వీటి కొనుగోలుకు వెనుకడుగు వేస్తారు. కానీ ఇటీవల కాలంలో కొన్ని కంపెనీలు లో బడ్జెట్ లో వీటిని అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. తాజాగా నిస్సాన్ కంపెనీకి చెందిన ఓ మోడల్ ఫెస్ లిప్ట్ ను రిలీజ్ చేశారు. ఇప్పటికే వచ్చిన ఈ మోడల్ కొత్తగా రూపాంతరం చెంది మార్కెట్లోకి వచ్చింది. కొత్తగా రిలీజ్ అయినా నిన్సాన్ కారు ఏదో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వివరాల్లోకి వెళ్లండి..

భారత్ లో నిస్సాన్ కంపెనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. 2020లో ఎంట్రీ ఇచ్చిన ఈ కంపెనీ ఇప్పటి వరకు వివిధ మోడళ్లను మార్కెట్లో లాంచ్ చేసింది. వీటిలో మాగ్నైట్ పాపులారిటీ సాధించింది. అయితే ఈ మోడల్ ఫేస్ లిప్ట్ ను అక్టోబర్ 4న మార్కెట్లోకి తీసుకొచ్చారు. దీని ధర, ఫీచర్లు చూసి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. SUV వేరియంట్ లో లో బడ్జెట్ లో అందుబాటులో ఉన్న ఈ కారు లేటేస్ట్ టెక్నాలజీ కూడిన ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఇంజిన్ పనితీరు మెరుగ్గా ఉండడంతో దీని కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.

నిస్సాన్ మాగ్నైట్ పాత మోడల్ మాదిరిగానే 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. దీనిపై 72 బీహెచ్ పీ పవర్, 96 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. అలాగే 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పై 100 బీహెచ్ పీ పవర్ 160 ఎన్ ఎం గరిష్ట టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ పై లీటర్ కు 17. 4 నుంచి 20 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. 5 ప్రయాణికులు సౌకర్యవంతంగా సుదూరం ప్రయాణించడానికి ఈ మోడల్ అనుగుణంగా ఉంటుంది.

సాధారణంగా ఎస్ యూవీ అనగానే ధర ఎక్కువగా ఉంటుందని అనుకుంటారు. కానీ నిస్సాన్ మాగ్నైట్ ఫేస్ లిప్ట్ రూ.5.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ రూ.11.50 లక్షలతో విక్రయిస్తున్నారు. ఈ కారులో 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లేలు ఆకర్షిస్తున్నాయి. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే తో పాటు వైర్ లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి వి సౌకర్యాన్ని ఇస్తున్నాయి.

నిస్సాన్ మాగ్నైట్ ఫేస్ లిప్ట్ మొత్తం 6 వేరియంట్లలో అందుబాటులో ఉంది. మాగ్నైట్ మాదిరిగానే ఫేస్ లిప్ట్ కూడా భేష్ అని అనిపించుకుంటుందని చాలా మంది అంటున్నారు. ఇందుల సేప్టీ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. అలాగే 360 డిగ్రీ కెమెరాతో సేప్టీ ఇవ్వనుంది.