https://oktelugu.com/

Nissan Magnite : రూ.87,000 భారీ డిస్కౌంట్ ఇచ్చే ఈ కారు గురించి తెలుసా? 

తక్కువ ధరకే ఎస్ యూవీని అందిస్తోంది. అంతేకాకుండా లేటేస్టు ఫీచర్స్ తో పాటు ప్రయాణికులకు అనుగుణంగా స్పెషిఫికేషన్స్ ను అమర్చారు. అయితే ఎస్ యూవీ కోరుకునేవారు ఇది బెస్ట్ కారు అంటున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : January 29, 2024 / 04:59 PM IST

    Nissan Magnite

    Follow us on

    Nissan Magnite :  నేటి కాలంలో ప్రతి ఒక్క SUV కార్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే బాహుబలి ఇంజిన్, విశాలమైన స్పేస్ ఉన్న కార్ల ధరలు కాస్త కాస్ట్లీ గానే ఉంటాయని చాలా మంది అభిప్రాయం. కానీ నిస్సాన్(Nissan) మ్యాగ్నెట్ (Magnite) కంపెనీ మాత్రం  తక్కువ ధరకే ఎస్ యూవీని అందిస్తోంది. అంతేకాకుండా లేటేస్టు ఫీచర్స్ తో పాటు ప్రయాణికులకు అనుగుణంగా స్పెషిఫికేషన్స్ ను అమర్చారు. అయితే ఎస్ యూవీ కోరుకునేవారు ఇది బెస్ట్ కారు అంటున్నారు. ఎందుకంటే తక్కువ ధరలోనే దీనిని సొంతం చేసుకోవడమే కాకుండా భారీ డిస్కౌంట్ ను పొందే అవకాశాన్ని కల్పించింది. మరి ఈ కారు గురించి వివరాల్లోకి వెళితే..

    నిస్సాన్ కాంపాక్ట్ ఎస్ యూవీ 1.0 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో ఇంజన్ ను కలిగి ఉంది. టర్బో ఇంజన్ 100 బీహెచ్ పీ పవర్, 160 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎస్ యూవీ మాన్యువల్ గేర్ బాక్స్ తో పాటు ఏఎంటీ గేర్ బాక్స్ తో పాటు మూడు ట్రాన్స్ మిషన్ ఆప్షన్లు ఉన్నాయి. ఇక ఈ కారు 7 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ను కలిగి ఉంది. అలాగే ఆటో ఎయిర్ కండిషన్ తోపాటు వైర్ లెస్ ఫోన్ చార్జర్, ఎయిర్ ఫ్యూరిఫైయిర్, జేబిఎల్ స్పీకర్ ఫాగ్ ల్యాంప్ వంటి సౌకర్యాలు కలిగి ఉన్నాయి.

    నిన్సాన్ కాంపాక్ట్ ఎస్ యూవీ లీటర్ కు 20 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అలాగే ఇన్నర్ స్పేస్ 336 లీటర్ల బూట్ స్పేష్ తో పాటు ఎస్ యూవీ డ్యూయెల్ టోన్ కలర్ తో పాటు మోనోటోన్ కలర్  ఆప్షన్ లో ఉంటుంది. ఇక నిస్సాన్ కారు రూ.6 లక్షల ధరతో ప్రారంభమై రూ.11.02 లక్షల వరకు విక్రయిస్తున్నారు.  ఇక ఇందులో రక్షణ కోసం డ్యూయెల్ ప్రంట్ ఎయిర్ బ్యాగులు, 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్  సిస్టమ్  భద్రతను కలిగిస్తాయి.

    ఎస్ యూవీ కావాలనుకునేవారు తక్కువ ధరలో కొనుగోలు చేయాలనుకుంటే నిస్సాన్ మాగ్నైట్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ కారుపై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. ఈ కారు కొనుగోలు చేస్తే రూ.87000 వరకు రాయితీ పొందవచ్చు. 28,000 ఎక్చేంజ్ బోనస్ అందుతుంది. అయితే  ఫైనాన్స్ పై ఈ వాహనం  కొనుగోలు చేస్తే వడ్డీ రేటు 6.99 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఈ డిస్కౌంట్ 2023, 2024 మాగ్నైట్ కార్లకే వర్తిస్తుంది.