Credit Cards : నేటి కాలంలో ప్రతి ఉద్యోగి వద్ద క్రెడిట్ కార్డు ఉంటోంది.ఆర్థిక వ్యవహారాలు, బ్యాలెన్స్ మెయింటెన్స్ ను బట్టి బ్యాంకులు కార్డులు జారీ చేస్తున్నాయి. అయితే క్రెడిట్ కార్డుల యూజ్ చేయడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. అంతే నష్టాలు ఉన్నాయి. చాలా మంది వీటి వాడకంలో అవగాహన లోపం కారణంగా అదనంగా చార్జీలు చెల్లిస్తున్నారు. క్రెడిట్ కార్డుల వాడకం ను బట్టి వాటికి చార్జీలు విధిస్తాయి. కానీ ఎప్పుడూ పరిమితికి మించి వాడకుండా జాగ్రత్త పడాలి. క్రెడిట్ కార్డుల విషయంలో చాలా మందికి కొన్ని సందేహాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి..
క్రెడిట్ కార్డులు వచ్చిన తరువాత ప్రతీ అవసరాన్ని దీనితో ఉపయోగిస్తున్నారు. ఈ కార్డులు అవసరానికి ముందస్తుగా డబ్బు ఇవ్వడంతో పాటు 45 రోజుల వరకు ఎలాంటి ఛార్జీలు వేయవు. అయితే చాలా మంది 45 రోజులు గడిచినా క్రెడిట్ కార్డుల బిల్లులు చెల్లించరు. దీంతో వాటికి అదనంగా వడ్డీ కడుతారు. ఇలా వడ్డీభారం మీద పడి అప్పుల పాలవుతారు. అయితే క్రెడిట్ కార్డులపై రివార్డులు వస్తుంటాయి. అలాగే కొన్ని వస్తువులపై డిస్కౌంట్లు ఇస్తాయి. వీటిని ఉపయోగించుకోవడం వల్ల కొంత భారం తగ్గించుకోవచ్చు.
చాలా మందికి క్రెడిట్ కార్డులపై రివార్డ్స్ ఉంటాయని తెలుసు. కానీ వాటిని ఎలా వాడాలో అవగాహన లేదు. ఈమధ్య క్రెడిట్ కార్డులు పెట్రోల్ బంకుల్లో వాడడం వల్ల అదనంగా ఛార్జీలు వేస్తున్నారు. అయితే పెట్రో కార్డులు తీసుకోవడం వల్ల ఎలాంటి ఛార్జీలు పడవు. అంతేకాకుండా ఆ కార్డు ఉపయోగించి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడం వల్ల రివార్డ్ పాయింట్స్ వస్తాయి. మళ్లీ పెట్రోల్ కొనుగోలు చేయాలనుకుంటే ఈ రివార్డ్ పాయింట్స్ తో కొనుగోలు చేయొచ్చు.
క్రెడిట్ కార్డుపై వార్షిక రుసుము ఎక్కువగా ఉంటుందని చాలా మందికి అపోహ ఉంటుంది. కానీ లిమిట్ ను బట్టి వార్షిక రుసుమును విధిస్తాయి. క్రెడిట్ కార్డు తో ఎక్కువగా అసవరం ఉన్న వారు లిమిట్ పెంచుకొని వార్షిక రుసుము చెల్లించుకోవచ్చు. తక్కువ అవసరం ఉన్న వారు లిమిట్ తగ్గించుకొని తక్కువ ఫీజు చెల్లించాలి. ఈ రకంగా క్రెడిట్ కార్డును వాడుతూ ఆదాయాన్ని పెంచుకోవాలి. లేకుండా అదనంగా ఛార్జీలు చెల్లించి అప్పుల పాలు కావొద్దు.