spot_img
Homeబిజినెస్Hybrid Engine 7 Seater Cars: హైబ్రిడ్ ఇంజన్..7 సీటర్.. వీటి గురించి తెలిస్తే వెంటనే...

Hybrid Engine 7 Seater Cars: హైబ్రిడ్ ఇంజన్..7 సీటర్.. వీటి గురించి తెలిస్తే వెంటనే కొంటారు..

Hybrid Engine 7 Seater Cars: ఆటో మోబైల్ మార్కెట్లో ప్రస్తుతం SUV లకు డిమాండ్ పెరిగిపోతుంది. చాలామంది విశాలమైన కారు కావాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం ఎంత ధర ఉన్నా వెనుకాడడం లేదు. అయితే ఈ SUV కారు హైబ్రిడ్ అయితే మరింత బాగుండు అని కోరుకునేవారు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారి కోసం కొన్ని కంపెనీలు రెండు ఇంజన్లు కలిగిన ఎస్సీ కార్లను తీసుకువస్తున్నాయి. ఇవి 7 సీటర్ కూడా కావడంతో ఉమ్మడి ఫ్యామిలీ ఉన్నవారికి చాలా రకాలుగా ఉపయోగాలుగా ఉంటుంది. అంతేకాకుండా దూర ప్రయాణాలు చేయడానికి అనుగుణంగా ఉంటుంది. అయితే త్వరలో కొన్ని కంపెనీలు ఈ వేరియంట్ కలిగిన కార్లను తీసుకురాబోతున్నాయి. వాడి గురించి వివరాలు కి వెళ్తే..

ప్రముఖ కార్ల కంపెనీ JSW చైనా కంపెనీ చెర్రీ తో కలిసి Jetour T2 అనే కారును తీసుకురాబోతున్నాయి. ఈ కారు 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ తోపాటు బ్యాటరీ ప్యాక్ కూడా ఉండనుంది. ఎలక్ట్రిక్ వేరియంట్ లో ఇది 130 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది. దీనిని ఇప్పటికే ప్రదర్శించారు. ఈ కారు డిజైన్ చూసి చాలామంది ఇంప్రెస్ అవుతున్నారు. నగర ప్రయాణికులతో పాటు దూర ప్రయాణాలు చేసే వారికి ఇది అనుగుణంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

MG మోటార్స్ నుంచి త్వరలో Majestor అనే 7 సీటర్ కారు విడుదల కానుంది. ఇందులో స్మార్ట్ టెక్నాలజీతో కూడిన ఫీచర్లు ఉండలు ఉన్నాయి. అలాగే సేఫ్టీ కోసం లెవల్ 2 ADAS, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు సేఫ్టీని అందిస్తాయి. ఇందులో 2.0 ట్విన్ టర్బో డీజిల్ ఇంజన్ ఉండనుంది. అలాగే ఎల్ఈడి లైటింగ్స్, 19 అంగుళాల వీల్స్ ఆకర్షించనున్నాయి. ఇంటీరియర్ లో 12.3 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టం ఉండనుంది.

Toyota కంపెనీకి చెందిన అర్బన్ క్రూజర్ హైడర్ అనే కారు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా త్వరలో మార్కెట్లోకి రాబోతుంది.. 7 సీటర్ అయినా ఈ కారులో పెట్రోల్ తో పాటు CNG ఇంజన్ కూడా అమర్చారు. ఈ రెండు ఇంజన్ ని కలిపి 27.97 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. అలాగే ఇందులో తొమ్మిది అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం ఉండనుంది.

రెనాల్ట్ కంపెనీకి చెందిన బోరియల్ అనే కారు త్వరలో ఆకర్షించే అవకాశం ఉంది. ఇందులో హైబ్రిడ్ ఇంజన్ ఉండడంతో చాలామంది దీనిని లైక్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా 7 సీటర్ కావడంతో ఎక్కువమంది దీనిని కొనుగోలు చేస్తారని అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version