Homeఆంధ్రప్రదేశ్‌AP women reserved constituencies: నియోజకవర్గాల పునర్విభజన.. ఏపీలో మహిళల నియోజకవర్గాలు ఇవే!

AP women reserved constituencies: నియోజకవర్గాల పునర్విభజన.. ఏపీలో మహిళల నియోజకవర్గాలు ఇవే!

AP women reserved constituencies: దేశవ్యాప్తంగా నియోజకవర్గాలు పెరగనున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్డీఏ సమావేశంలో స్పష్టమైన సంకేతాలు అందాయి దీనిపై. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే పునర్విభజన బిల్లు పార్లమెంట్లో ఆమోదించనున్నారు. అదే జరిగితే దేశవ్యాప్తంగా పార్లమెంట్ సీట్లతో పాటు అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య గణనీయంగా పెరగనుంది. అయితే ఇప్పటికే మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తూ 2023లో పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందింది. అయితే ఇప్పుడు పునర్విభజన బిల్లుతో పాటు మహిళా బిల్లును కూడా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం సంచలనంగా మారింది. పునర్ విభజనకు సంబంధించి ఏపీలో 50% చొప్పున అసెంబ్లీ, లోక్సభ సీట్లు పెరగనున్నాయి.

మహిళా రిజర్వేషన్లు అమలు
ప్రస్తుతం ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు సీట్లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ తాజా ప్రతిపాదనతో అసెంబ్లీ స్థానాలు 263, లోక్సభ సీట్లు 38 కి చేరుకుంటాయి. మహిళా ప్రాతినిధ్యం కూడా పెరగనుంది. వారికి 87 అసెంబ్లీ, 13 పార్లమెంట్ సీట్లు దక్కనున్నాయి. అయితే ఫలానా నియోజకవర్గం మహిళలకు రిజర్వ్ చేస్తారని చెప్పడం కష్టం కానీ.. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలను మాత్రం మహిళలకు రిజర్వ్ చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికం. వాటిని మహిళలకు రిజర్వ్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

Also Read: అమరావతి అంటుకుందా? అంటించారా? భారీ కుట్ర జరిగిందా?

అసెంబ్లీ నియోజకవర్గాలు..
రాష్ట్రంలో ప్రధానంగా భీమిలి నియోజకవర్గం లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అక్కడ ఏకంగా 1,65,570 మంది మహిళలు ఉండడం విశేషం. పాణ్యం, గాజువాక, చంద్రగిరి, తిరుపతి, మంగళగిరి, పెనమలూరు, రంపచోడవరం, పెందుర్తి, గురజాల, విశాఖపట్నం నార్త్,కోవూరు, కర్నూలు, విజయవాడ ఈస్ట్,విజయవాడ సెంట్రల్, గుంటూరు వెస్ట్,గన్నవరం, మైలవరం, నెల్లూరు రూరల్, తెనాలి, నంద్యాల, అనంతపురం అర్బన్, ఇచ్చాపురం, కడప, శ్రీకాకుళం, చింతలపూడి, రాజమహేంద్రవరం సిటీ,ప్రత్తిపాడు, రాజమహేంద్రవరం రూరల్, గుంతకల్లు, కాకినాడ సిటీ, పలమనేరు, విశాఖపట్నం ఈస్ట్, మాచర్ల,వినుకొండ, కాకినాడ రూరల్, భీమవరం, రాయదుర్గం, మదనపల్లి,పోలవరం, కావలి,జమ్మలమడుగు,కొత్తపేట, పాయకరావుపేట, శ్రీకాళహస్తి, ప్రొద్దుటూరు,ఆదోని, విజయనగరం, రాయచోటి, కదిరి, రాప్తాడు,ఆలూరు, గుంటూరు ఈస్ట్, విజయవాడ వెస్ట్, గూడూరు, ఒంగోలు, బనగానపల్లె,తాడిపత్రి నియోజకవర్గాల్లో మహిళలు అధికం.

పార్లమెంట్ స్థానాలు..
పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి విశాఖపట్నంలో అత్యధికంగా 9,20,376 మంది మహిళలు ఉన్నారు. ఆ తరువాత స్థానాల్లో గుంటూరు, నరసరావుపేట, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, నంద్యాల,విజయవాడ, కర్నూలు,కాకినాడ, ఏలూరు, కడప, చిత్తూరు, రాజంపేట, శ్రీకాకుళం, అనకాపల్లి, హిందూపురం, రాజమండ్రి,ఒంగోలు, అరకు, విజయనగరం, మచిలీపట్నం, బాపట్ల, అమలాపురం, నరసాపురం పార్లమెంట్ స్థానాల్లో మహిళలు ఎక్కువ. మరి ఈ నియోజకవర్గాల్లో మహిళలకు ఛాన్స్ దక్కుతుందా? లేదా? అన్నది చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version