
కొత్త కారును కొనుగోలు చేయాలని భావిస్తున్నారా..? అయితే కొన్ని నెలలు ఆగితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. రాబోయే కొన్ని నెలల్లో మార్కెట్లోకి ఎన్నో కొత్త కార్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రముఖ కంపెనీలకు చెందిన కొత్త మోడళ్లు అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్ లోకి అందుబాటులోకి రానుండటం గమనార్హం. ప్రముఖ కంపెనీలలో ఒకటైన స్కోడా అక్టేవియా కారును మార్కెట్ లోకి తీసుకురానుంది.
పెట్రోల్ ఇంజిన్ తో అందుబాటులోకి రానున్న ఈ కారు ధర 18 లక్షల రూపాయల నుంచి 24 లక్షల రూపాయల మధ్యలో ఉండవచ్చని సమాచారం. ఓక్టావియా సిరీస్ లో వస్తున్న నాలుగో కారు అయిన ఈ కారుకు ఇంటీరియర్, ఎక్స్ టీరియర్ డిజైన్ లో అనేక మార్పులు చేశారని తెలుస్తోంది. హ్యూందాయ్ కంపెనీ అల్కాజార్ పేరుతో పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వేరియంట్స్ ఉన్న కారును అందుబాటులోకి తీసుకుస్తోంది.
ఆటోమాటిక్ టాన్స్ మిషన్ ఆప్షన్, మాన్యువల్ ఆప్షన్లతో అందుబాటులోకి వస్తున్న ఈ కారు ధర 13 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల మధ్య ఉండే అవకాశం ఉందని సమాచారం. మారుతి సుజుకి టయోటా బెల్టా పేరుతో సియాజ్ కారును రీబ్రాండ్ చేసి మార్కెట్ లోకి తీసుకురానుంది. ఈ కారు ధర 9 లక్షల రూపాయల నుంచి 12 లక్షల రూపాయల లోపు ఉండవచ్చని తెలుస్తోంది.
స్కోడా కంపెనీ మిడ్ సైజ్ కారుగా కుషాక్ అనే కారును మార్కెట్ లోకి తీసుకొస్తుండగా ఈ కారును విజన్ ఇన్ కాన్సెప్ట్ లో రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ కారు ధర 9 లక్షల నుంచి 17 లక్షల మధ్యలో ఉండవచ్చని సమాచారం. మారుతి సుజుకి సెలేరియా, ఫోక్స్ వ్యాగన్ టైగన్, టాటా హెచ్.బీ.ఎక్స్ కారు కూడా రాబోయే రోజుల్లో మార్కెట్ లోకి అందుబాటులోకి రానుంది.