
మామూలుగా సినిమాల్లోనే అలాంటి స్టన్స్ కనిపిస్తాయి. హీరో కొడితే ఆమడ దూరం విలన్లు పడిపోతారు. బల్లలు, మంచాలు విరిగిపడుతుంటాయి. తంతే అల్లంత దూరం గడ్డివాముపై పడుతారు. దానికోసం క్రేన్లు పెట్టి షూటింగ్ లు జరుపుతారు.
కానీ వకీల్ సాబ్ సినిమా చూసి అచ్చం అలాగే ఈ నెల్లూరు కుర్రాళ్లు తీసిన పేరడి వీడియో గూస్ బాంబ్స్ తెప్పిస్తోంది. పవర్ స్టార్ నటించిన పవర్ ఫుల్ మూవీ ‘వకీల్ సాబ్’ ఫైట్ సీన్ ను యాజ్ టీజ్ అంతకుమించి వేరే లెవల్ లో దించేశారు నెల్లూరు కుర్రాళ్లు.
వకీల్ సాబ్ సినిమాలోని ముగ్గురు అమ్మాయిలను కాపాడే ఫైట్ సీన్ ను రీక్రియేట్ చేస్తూ నెల్లూరుకు చెందిన కొంతమంది కుర్రాళ్లు ఓ వీడియో తెరకెక్కించారు. యాక్షన్ సన్నివేశాలను కుర్రాళ్లు మైండ్ బ్లోయింగ్ పవర్ ఫుల్ గా తెరకెక్కించారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో షేర్ చేయడంతో అందరికీ చేరువైంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసి కుర్రాళ్లు ఇరగదీశారని కామెంట్లు పెడుతున్నారు.
https://twitter.com/Guntur_PSPKFC/status/1396522984538443779?s=20