https://oktelugu.com/

ప‌వ‌ర్ స్టార్ కోసం.. భాగ్యన‌గ‌రం మ‌ళ్లీ నిర్మి‌స్తున్నారు!

ఫిల్మ్ మేక‌ర్స్‌.. తాము చెప్పాల‌నుకున్న క‌థ‌లో ప్రేక్ష‌కుల‌ను విహ‌రింప‌జేయాలంటే.. ప్ర‌ధానంగా కావాల్సింది లొకేష‌న్స్‌. వాటిని ఎంత అద్భుతంగా చూపిస్తే.. ఆడియ‌న్స్ అంత‌గా క‌నెక్ట్ అవుతారు. ఆల్రెడీ లొకేష‌న్స్ ఉంటే.. వాటిని మ‌రింత సూప‌ర్బ్ గా చూపించాలి.. అవి లేక‌పోతే కొత్త‌గా ‘సెట్’ చేయాలి. అందుకే.. సెట్స్ మీదనే నడుస్తుంది సినిమా. ఇక, చారిత్రక సినిమాలు తెరకెక్కాలంటే మాత్రం అన్నీ మారిపోతాయి. ఇప్పుడున్న లొకేషన్స్ మొత్తం మార్చేసి.. ఓ కొత్త లోకాన్ని నిర్మించాల్సి ఉంటుంది. ఇప్పుడు పవర్ స్టార్ […]

Written By:
  • Rocky
  • , Updated On : February 20, 2021 / 01:27 PM IST
    Follow us on


    ఫిల్మ్ మేక‌ర్స్‌.. తాము చెప్పాల‌నుకున్న క‌థ‌లో ప్రేక్ష‌కుల‌ను విహ‌రింప‌జేయాలంటే.. ప్ర‌ధానంగా కావాల్సింది లొకేష‌న్స్‌. వాటిని ఎంత అద్భుతంగా చూపిస్తే.. ఆడియ‌న్స్ అంత‌గా క‌నెక్ట్ అవుతారు. ఆల్రెడీ లొకేష‌న్స్ ఉంటే.. వాటిని మ‌రింత సూప‌ర్బ్ గా చూపించాలి.. అవి లేక‌పోతే కొత్త‌గా ‘సెట్’ చేయాలి. అందుకే.. సెట్స్ మీదనే నడుస్తుంది సినిమా. ఇక, చారిత్రక సినిమాలు తెరకెక్కాలంటే మాత్రం అన్నీ మారిపోతాయి. ఇప్పుడున్న లొకేషన్స్ మొత్తం మార్చేసి.. ఓ కొత్త లోకాన్ని నిర్మించాల్సి ఉంటుంది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా కోసం అదే జరుగుతోంది.

    Also Read: ఓరి నాయనో.. బట్టలన్నీ విప్పేసిన పాయల్!

    ప‌వ‌న్ కల్యాణ్, దర్శకుడు క్రిష్ కాంబినేష‌న్ లో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 15వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యపు కాలం నాటి పరిస్థితుల ఆధారంగా రూపొందుతోంది. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే హ‌య్యెస్ట్ బడ్జెట్ మూవీగా నిల‌వ‌బోతోంది. దాదాపు 170 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నార‌ట‌. మొఘ‌ల్ కాలం నాటి ప‌రిస్థితుల‌ను క‌ళ్ల‌కు క‌ట్టాలంటే ప‌క్కాగా సెట్స్ రూపొందించాల్సి ఉంది మ‌రి!

    దీంతో.. హైద‌రాబాద్ లోనే ప్ర‌త్యేకంగా భారీ సెట్ ను నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల న‌గ‌రంలో ఈ సినిమాకు సంబంధించిన‌ ఓ షెడ్యూల్ ముగిసింది. వ‌చ్చేవారం మ‌రో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ కోసం ప‌ది రోజుల డేట్లు కేటాయించాడు ప‌వ‌న్‌. ఈ ప‌ది రోజుల్లో కీల‌క‌మైన స‌న్నివేశాల్ని తెర‌కెక్కించ‌డానికి ప్లాన్ చేస్తున్నాడు క్రిష్.

    Also Read: రాంచరణ్ బలం ఏంటో తెలుసా? వైరల్ ఫొటో

    ఈ షెడ్యూల్ కోసం గండి కోట సెట్ ని సిద్ధం చేస్తున్నారు. రాజీవ‌న్ నేతృత్వంలో శ‌ర‌వేగంగా ఈ డిజైన్ చేస్తున్నారు. కాగా.. ఈ మూవీకోసం చార్మినార్ సెట్ కూడా వేసిన సంగ‌తి తెలిసిందే. ఇవి మాత్ర‌మే కాకుండా.. హైద‌రాబాద్ లోని చారిత్రాత్మ‌క క‌ట్ట‌డాల సెట్స్ మొత్తం వేయ‌నున్నార‌ట‌. మొత్తంగా చెప్పాలంటే ప‌వ‌న్ సినిమా కోసం ఒక‌ప్ప‌టి భాగ్య‌న‌ర‌గ‌రానికి మ‌ళ్లీ నిర్మించ‌బోతున్నార‌న్నామ‌ట‌.

    ఈ షెడ్యూల్ మొత్తం పూర్త‌యిన త‌ర్వాత ఈ సినిమాలో ప‌వ‌న్ లుక్ ను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే ప‌వ‌న్ కోసం అద్భుత‌మైన గెట‌ప్ సిద్ధం చేశాడ‌ట క్రిష్‌. ఈ చిత్రానికి ‘వీరమల్లు’ అనే టైటిల్ అనుకుంటున్నట్టు సమాచారం. కాగా.. ఈ సినిమాను పాన్ ఇండియా లెవ‌ల్లో రూపొందించ‌బోతున్నారు. దీంతో.. ఇత‌ర భాష‌ల‌కు చెందిన యాక్ట‌ర్స్ ను కూడా తీసుకోబోతున్నాడు ద‌ర్శ‌కుడు. ప‌వ‌న్ స‌ర‌స‌న ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్, బాలీవుడ్ భామ‌ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ న‌టిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఏ.ఎమ్ రత్నం ఈ భారీ బ‌డ్జెట్ చిత్రం నిర్మిస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్