ATM Withdrawal Charges
ATM Charges: బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి కూడా మీరు ఏడు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్న కారణంగా ఏటీఎం వినియోగం తగ్గినట్లు తెలుస్తుంది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం విత్ డ్రాయల్స్ చార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. బ్యాంకు కస్టమర్లు మే ఒకటి నుంచి నెలవారి ఉచిత లావాదేవీ పరిమితి మించితే ప్రతి అదనపు లావాదేవీకి రూ.2 అదనంగా చెల్లించాలి. ప్రస్తుతం బ్యాంకులో ఉచిత లావాదేవీ పరిమితిని దాటిన తర్వాత ప్రతి ఉపసంహరణపై రూ.21 వసూలు చేస్తున్నాయి. అయితే తాజాగా దానిని రూ.23 కి పెంచారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం ఇంటర్ చేంజ్ రుసుమును కూడా రూ.2 పెంచింది. తాజాగా ప్రతి ఇంటర్ చేంజ్ లావాదేవీ పై రు.19 చార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఇంటర్ చేంజ్ ఫీజు రూ.17 గా ఉంది. తాజాగా వెలువడిన బ్యాంకుల నిబంధనల ప్రకారం కస్టమర్లు మెట్రో నగరాల్లో ప్రతినెల ఐదు ఉచిత లావాదేవీలు మరియు మెట్రో ఎతరా నగరాలలో మూడు ఉచిత లావాదేవీలను చేసుకోవచ్చు. ఆ తర్వాత చేసే ప్రతి అదనపు లావాదేవీపై నిర్ణీత చార్జర్ చెల్లించాల్సి ఉంటుంది. ఆర్.బి.ఐ వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్ల అభ్యర్థన మేరకు ఈ చార్జీలను పెంచినట్లు నిర్ణయం తీసుకుంది. అయితే ఆపరేటర్లు నిర్వహణ ఖర్చులు పెరుగుతున్న క్రమంలో చార్జీలను పెంచాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. బ్యాలెన్స్ చెకింగ్ వంటి వాటికీ కూడా చార్జీలను పెంచారు. గతంలో బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి ఆరు రూపాయలు చెల్లించాల్సి ఉండేది.
ప్రస్తుతం అది 7 రూపాయలకు పెంచారు. ఏటీఎం ఇంటర్ చేంజ్ అంటే ఏటీఎం సేవను అందించడానికి ఒక బ్యాంకు మరో బ్యాంకుకు చెల్లించే రుసుమును ఏటీఎం ఎంటర్ చేంజ్ ఫీజ్ అంటారు. సాధారణంగా ఇది ప్రతి లావాదేవీ పై విధించే స్థిరమైన రుసుము. బ్యాంకులో వీటిని తమ కస్టమర్ల నుండి వసూలు చేస్తాయి. అయితే ఏటీఎం నెట్వర్క్ సంబంధిత సేవల కోసం చిన్న చిన్న బ్యాంకులో పెద్ద ఆర్థిక సంస్థలపై ఆధారపడటం కారణంగా ఏటీఎం చార్జీల పెరుగుదల చిన్నచిన్న బ్యాంకుల కస్టమర్లపై ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయని తెలుస్తుంది.
ప్రస్తుత కాలంలో డిజిటల్ చెల్లింపులు ఎక్కువగా జరుగుతున్న కారణంగా ఏటీఎం నుండి డబ్బులు ఉపసంహరణ అవసరం తగ్గింది. అయితే తాజాగా ప్రభుత్వ డేటా ప్రకారం భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల మొత్తం విలువ FY14 లో రు.952 లక్షల కోట్లు ఉండగా FY23 నాటికి ఇది రూ.3658 లక్షల కోట్లకు పెరిగినట్లు సమాచారం. ఇది ప్రజలు ప్రస్తుతం నగదురహిత లావాదేవీలకు ప్రాధాన్యమిస్తున్నట్లు చూపిస్తుంది.