New Rule : ఇండియాలో రోడ్డు భద్రతను మరింత పటిష్టం చేసే లక్ష్యంతో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఒక సంచలన ప్రకటన చేశారు. ఇకపై ప్రతి టూ-వీలర్ కొనుగోలు చేసినప్పుడు రెండు ఐఎస్ఐ (ISI) సర్టిఫైడ్ హెల్మెట్లను తప్పనిసరిగా ఇవ్వాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. న్యూఢిల్లీలో జరిగిన ఆటో సమ్మిట్‌లో ఈ ముఖ్యమైన నిర్ణయాన్ని ఆయన ప్రకటించారు. టూ-వీలర్ హెల్మెట్ తయారీదారుల సంఘం ఆఫ్ ఇండియా ఈ నిర్ణయానికి తమ సపోర్ట్ తెలిపింది. గడ్కరీ తీసుకున్న ఈ కఠినమైన చర్యను పరిశ్రమ వర్గాలు కూడా స్వాగతించాయి. ఇది రోడ్డు ప్రమాదాల్లో సంభవిస్తున్న మరణాలను నివారించడానికి సహాయపడుతుందని భావిస్తున్నారు.
ALso Read : దేవుడా ఆఫర్ ఏంటి ఇలా ఉంది.. కేవలం రూ.5వేలకే సీఎన్జీ బైకా ?
టూ-వీలర్ హెల్మెట్ తయారీదారుల సంఘం (THMA) చాలా కాలంగా ఐఎస్ఐ సర్టిఫైడ్ హెల్మెట్ల తప్పనిసరి నిబంధన కోసం డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో గడ్కరీ తీసుకున్న చొరవను వారు ప్రశంసించారు. మన దేశంలో రోడ్డు ప్రమాదాల గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయి. ప్రతేడాది 4,80,000 కంటే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిలో దాదాపు 1,88,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. మరణించిన వారిలో 66శాతం మంది 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు గలవారే. ముఖ్యంగా టూ-వీలర్ ప్రమాదాల్లో ఏటా 69,000 మందికి పైగా మరణిస్తున్నారు. వీరిలో 50శాతం మరణాలకు హెల్మెట్ ధరించకపోవడమే కారణం.
ఈ సందర్భంగా THMA అధ్యక్షుడు రాజీవ్ కపూర్ మాట్లాడుతూ.. “ఇది కేవలం ఒక నియమం మాత్రమే కాదు. దేశానికి ఇది చాలా అవసరం. రోడ్డు ప్రమాదాల్లో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ఈ నిర్ణయం ఒక ఆశాకిరణం. ఇలాంటి విషాదాలను ఇకపై నివారించవచ్చని వారు ఆశిస్తున్నారు” అని అన్నారు. టూ-వీలర్ రైడింగ్ ఇకపై ప్రమాదకరమైనదిగా ఉండకూడదని ఇండస్ట్రీ వర్గాలు నొక్కి చెప్పాయి. రైడర్‌తో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా ఐఎస్ఐ సర్టిఫైడ్ హెల్మెట్ ధరిస్తే, ప్రయాణం సురక్షితంగా, బాధ్యతాయుతంగా ఉంటుంది. హెల్మెట్ తయారీదారుల సంఘం నాణ్యమైన ఐఎస్ఐ హెల్మెట్ల ఉత్పత్తిని పెంచుతామని హామీ ఇచ్చింది. ఈ చర్య భారతదేశంలో సురక్షితమైన టూ-వీలర్ ప్రయాణాల కొత్త శకానికి నాంది పలుకుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇకపై రూ. 2000 జరిమానా
భారత ప్రభుత్వం 1998 మోటార్ వాహనాల చట్టంలో కూడా మార్పులు చేసింది. దీని ప్రకారం టూ-వీలర్ నడిపే వారు హెల్మెట్ ధరించకపోయినా.. లేదా సరిగ్గా ధరించకపోయినా తక్షణమే రూ. 2,000 వరకు జరిమానా విధించబడుతుంది. అంటే, బైక్ నడిపే వ్యక్తి హెల్మెట్ పెట్టుకున్నా అది ఓపెన్‌గా ఉంటే రూ. 1,000 జరిమానా విధిస్తారు. హెల్మెట్ పెట్టుకుని తలకు గట్టిగా పట్టేలా బెల్ట్ పెట్టుకోకపోయినా రూ. 1,000 జరిమానా ఉంటుంది. మొత్తానికి హెల్మెట్‌ను పూర్తిగా, సరిగ్గా ధరించాల్సిందే. అలా చేయని పక్షంలో రూ. 2,000 చలానా విధిస్తారు.
Also Read : కైనటిక్ కొత్త ఈ లూనా వచ్చేస్తోంది.. రేంజ్‌తో మార్కెట్ షేక్ చేయడం ఖాయం