Kinetic Green E Luna
Kinetic Green E Luna : భారత టూవీలర్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ కు మార్కెట్ పెరుగుతోంది. ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని కైనెటిక్ గ్రీన్ తన పాపులర్ మోపెడ్ ఈ-లూనా కొత్త వెర్షన్ డిజైన్‌కు పేటెంట్ పొందింది. న్యూస్ వెబ్‌సైట్ రష్‌లేన్‌లో ప్రచురితమైన వార్తల ప్రకారం.. ఈ కొత్త వెర్షన్‌లో రిమూవబుల్ బ్యాటరీ ఉండవచ్చు. కంపెనీ ఫిబ్రవరి 2024లో కైనెటిక్ ఈ-లూనాను రూ.69,990 ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేసిన విషయం తెలిసిందే.
Also Read :సేల్స్ లో దుమ్ము రేపుతున్న CNG బైక్స్.. ఏ కంపెనీదో తెలుసా?
ప్రస్తుతం ఉన్న ఈ-లూనా X2, X3, X3 Go, X3 Plus, X3 Pro, X3 Prime వంటి అనేక వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇప్పుడు కైనెటిక్ ఈ-లూనా కొత్త డిజైన్ పేటెంట్ లీక్ అయింది. ఇది ఫ్లోర్‌బోర్డ్‌పై రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉండవచ్చని చూపిస్తుంది. ఈ మార్పు వినియోగదారులకు బ్యాటరీని సులభంగా తీసి ఛార్జ్ చేసుకోవడానికి లేదా అదనపు బ్యాటరీని తీసుకెళ్లడానికి వీలు కల్పిస్తుంది.. తద్వారా రేంజ్ పెరుగుతుంది.
ఈ-లూనా ఆకట్టుకునే ఫీచర్లు
ప్రస్తుతం ఉన్న ఈ-లూనా ఫీచర్ల గురించి మాట్లాడితే, ఇందులో 16-ఇంచుల వీల్స్, క్రాలు, 170 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, RSU టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్‌లు, వెనుక భాగంలో ట్విన్-షాక్ అబ్జార్బర్‌లు, రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్‌లు, గుండ్రటి హెడ్‌లైట్ వంటి అంశాలు ఉన్నాయి. ఈ ఫీచర్లు మోపెడ్‌కు స్ట్రాంగ్ రూపాన్ని అందిస్తాయి.
110 కిమీ వరకు రేంజ్
పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే.. కొత్త ఈ-లూనాలో 2 KWh ఫిక్స్‌డ్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 110 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతుంది. అంతేకాకుండా, రిమూవబుల్ ఎక్స్ ట్రా బ్యాటరీని కూడా అందించే అవకాశం ఉంది. ఇది రేంజ్‌ను దాదాపు 200 కిలోమీటర్ల వరకు పెంచుతుంది. మీడియా నివేదికల ప్రకారం… కొత్త ఈ-లూనా త్వరలో మార్కెట్‌లోకి ప్రవేశించనుంది. తొలగించగల బ్యాటరీ ఫీచర్ అందుబాటులోకి వస్తే, ఇది ఎలక్ట్రిక్ మోపెడ్ సెగ్మెంట్‌లో ఒక ముఖ్యమైన ముందడుగు అవుతుంది. వినియోగదారులకు మరింత ఎక్కువ ప్రయాణ రేంజ్ అందిస్తుంది.
Also Read : బైక్ లకు డీజిల్ ఇంజన్లు ఎందుకు ఏర్పాటు చేయరో తెలుసా?