New Credit Card Payment Rules: ప్రస్తుత కాలంలో ఆర్థిక అవసరాల కోసం ఇతరుల దగ్గర చేయి చాపాల్సిన పరిస్థితి తక్కువవుతుంది. ఎందుకంటే చిరు ఉద్యోగులకు సైతం బ్యాంకులు కావాల్సిన డబ్బు సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఇవి రుణాల ద్వారా కావచ్చు.. క్రెడిట్ కార్డుల ద్వారా కావచ్చు.. అయితే రుణం కంటే ఎక్కువ క్రెడిట్ కార్డు తీసుకున్న వారే ఉన్నారు. క్రెడిట్ కార్డుల సహాయంతో అత్యవసర ఆర్థిక అవసరాలను తీర్చుకొని.. ఆ తర్వాత కొన్ని రోజులపాటు వడ్డీ లేకుండా డబ్బులు వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే క్రెడిట్ కార్డులు వాడేవారు గడువు తేదీ లోగా బిల్లులు చెల్లించకపోతే ఆర్థిక భారం తీవ్రంగా పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించేవారు Minimum Amount Due అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇటీవల మీ చెల్లింపులపై కొన్ని మార్పులు వచ్చాయి. అవేంటంటే?
క్రెడిట్ కార్డు అవసరానికి వాడుకున్న తర్వాత ఆ బిల్లును నెల రోజుల తర్వాత చెల్లించాల్సి ఉంటుంది. అయితే బిల్లు జనరేట్ అయిన తర్వాత 15 రోజుల గడువు ఉంటుంది. ఈ గడువులోగా బిల్లును కచ్చితంగా చెల్లించాలి. లేకపోతే 30% అదనపు వడ్డీ రేటు తో చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పెనాల్టీ ఫీజు అదనంగా ఉంటుంది. సిబిల్ స్కోర్ పై కూడా ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. అయితే బిల్లు జనరేట్ అయిన తర్వాత అందులో Total Dueతో పాటు Minimum Amount Due అనే ఆప్షన్ ఉంటుంది. ఈ రెండు ఆప్షన్లలో కొందరు తక్కువ మొత్తంలో చెల్లించాలని మినిమం అమౌంట్ డ్యూ ఫై ఆసక్తి చూపుతారు. కానీ అలా చేస్తే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే?
Also Read: Credit Card Charges : జులై 1 నుంచి క్రెడిట్ కార్డులపై కొత్త చార్జీలు అమలు..
బిల్లు మొత్తం లో మినిమం అమౌంట్ డ్యూ అంటే ఉన్న దానిలో 25% చెల్లించాలన్నమాట. అంటే మిగతా మొత్తం తర్వాత చెల్లించుకోవచ్చు అని కొందరు అనుకుంటారు. కానీ ఆ మిగతా మొత్తానికి అదనంగా వడ్డీ వేస్తారని విషయం చాలామందికి తెలియదు. అంతేకాకుండా ఈ వడ్డీ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో ఇటీవల కొన్ని మార్పులు చేశారు. ముఖ్యంగా SBI క్రెడిట్ కార్డు ఉన్నవారికి ఈ మార్పులు జూలై 15 నుంచి వర్తించనున్నాయి.
ఇప్పటివరకు మినిమం డ్యూ చెల్లించే వారికి జీఎస్టీ, ఇతర చార్జీలను మినిమం డ్యూ లో కొంత భాగం మాత్రమే చేర్చేవారు. దీంతో పెద్దగా భారంపడేది కాదు. కానీ ఇప్పుడు మినిమం డ్యూ లో 100% జిఎస్టి, 100% అదనపు చార్జీలు చేర్చి బిల్లును జనరేట్ చేస్తున్నారు. దీంతో మినిమం డ్యూ బిల్లు చెల్లించే వారికి తడిసి మోపడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మిగిలిన అమౌంట్ పై అదనంగా జీఎస్టీ పడే అవకాశం కూడా ఉంది.
అందువల్ల క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించేవారు మినిమం డ్యూ జోలికి వెళ్లకుండా బిల్లు మొత్తం చెల్లించేలా ప్లాన్ చేసుకోవాలి. సరైన డబ్బు లేని సమయంలో ఇతర మార్గాల నుంచి తెచ్చినా సరే.. బిల్లు మొత్తం చెల్లించేలా ప్లాన్ చేసుకోవాలి. లేకుంటే అదనంగా ఆర్థిక భారం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు.