https://oktelugu.com/

రైతులకు శుభవార్త.. ఈ పంటతో రూ.8 లక్షల ఆదాయం..?

దేశంలోని రైతులు ఈ మధ్య కాలంలో అకాల వర్షాల వల్ల, పంట దిగుబడి తక్కువగా రావడం వల్ల, పంటకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే రైతులు తెలివిగా వ్యవసాయం చేస్తే మాత్రం నష్టాలు రాకుండా జాగ్రత్త పడే అవకాశాలు ఉండటంతో పాటు భారీ లాభాలను సులువుగా పొందవచ్చు. కీరదోస పంట సాగు చేయడం ద్వారా లక్షల్లో లాభాలను సొంతం చేసుకోవచ్చు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా దుర్గాప్రసాద్ అనే రైతు ఈ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 28, 2021 / 07:15 PM IST
    Follow us on

    దేశంలోని రైతులు ఈ మధ్య కాలంలో అకాల వర్షాల వల్ల, పంట దిగుబడి తక్కువగా రావడం వల్ల, పంటకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే రైతులు తెలివిగా వ్యవసాయం చేస్తే మాత్రం నష్టాలు రాకుండా జాగ్రత్త పడే అవకాశాలు ఉండటంతో పాటు భారీ లాభాలను సులువుగా పొందవచ్చు. కీరదోస పంట సాగు చేయడం ద్వారా లక్షల్లో లాభాలను సొంతం చేసుకోవచ్చు.

    వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా దుర్గాప్రసాద్ అనే రైతు ఈ పంటను సాగు చేయడం ద్వారాఏకంగా 8 లక్షల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దుర్గాప్రసాద్ అనే రైతు నెదర్లాండ్స్ నుండి కీరదోస విత్తనాలను కొనుగోలు చేసి సాగు చేశాడు. మన దేశంలోని కీరదోసలలో విత్తనాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. నెదర్లాండ్స్ నుంచి కొనుగోలు చేసిన కీర దోసల్లో మాత్రం విత్తనాలు ఉండవు.

    దేశీ కీరదోసతో పోలిస్తే ఈ కీరదోస రెట్టింపు ధర పలుకుతుంది. కేవలం రెండున్నర నెలల్లో పంట చేతికి వస్తుంది. దుర్గాప్రసాద్ ఈ పంట కోసం 72,000 రూపాయలు ఖర్చు చేసి తెప్పించుకోగా ఈ పంటపై అతనికి ఎనిమిది లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. ఇతర కాలాలతో పోలిస్తే వేసవి కాలం కీరదోస పంట వేయడానికి అనువైన కాలం. వర్షాకాలంలో కూడా ఈ పంటను సాగు చేయవచ్చు.

    ఈ పంట వేసేవాళ్లకు ఉద్యాన శాఖ నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. దగ్గరలోని ఉద్యానశాఖ కార్యాలయాన్ని సంప్రదించి ఈ పంటకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. రైతులకు ఈ పంట ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు.