Homeబిజినెస్New Car Offers : ఇలా చేస్తే.. అప్పు లేకుండా.. భారీ డిస్కౌంట్‌తో కొత్త కారు...

New Car Offers : ఇలా చేస్తే.. అప్పు లేకుండా.. భారీ డిస్కౌంట్‌తో కొత్త కారు మీ సొంతం!

New Car Offers : కారు.. ఒకప్పుడు సంపన్నులకే పరిమితం.. కానీ నేడు మిడిల్‌ క్లాస్‌ డ్రీమ్‌. ఇష్టమైన కారు కొనాలని కలలు కంటుంటారు. ఇందుకోసం డబ్బులు పొదుపు చేసే ప్రయత్నం చేస్తుంటారు. కానీ, కొంతమంది మాత్రమే నెరవేర్చుకుంటున్నారు. చాలా మందికి అది కలగానే మిగిలిపోతోంది. కానీ ఈ విషయం తెలిస్తే మీరూ తక్కువ ధరకు, అప్పు లేకుండా, భారీ డిస్కౌంట్‌తో కొత్త కారు కొనుగోలు చేయవచ్చు. అదేంటో తెలుసుకుందాం.

మీకు నచ్చిన కారు సెలక్ట్‌ చేసుకోండి..
ఈ ఆఫర్‌తో మీకు నచ్చిన కారు కొనుగోలు చేయవచ్చు. మీకు ఏ బ్రాండ్‌ కావాలంటే ఆ బ్రాండ్‌ సెలెక్ట్‌ చేసుకోవచ్చు. ఇక డిస్కౌంట్‌ అయితే మామూలుగా ఉండదు. 25 శాతం నుంచి 30 శాతం వరకు డిస్కౌంట్‌ వస్తుంది. ఇక ఈ ఆఫర్‌ పండుగల వేళ మాత్రమే ఉండదు. ఏడాదంతా ఈ ఆఫర్‌ ఉంటుంది. మీరు ఏ బ్రాండ్‌ కావాలో సెలక్ట్‌ చేసుకోవడమే ఆలస్యం.

ఈ ట్రిక్‌ తెలుసుకోండి…
మీరు రూ.10 లక్షల కారు కొనాలనుకుంటే.. దానిపై 30 శాతం డిస్కౌంట్‌ వస్తుంది. కానీ, ఈ విషయం ఏ షోరూం వాళ్లు మనకు చెప్పరు. ఈ ట్రిక్‌ తెలుసుకుంటే.. మీరూ భారీ డిస్కౌంట్‌తో కొత్త కారు మీ సొంతం చేసుకోవచ్చు. అదేంటంటే.. ప్రతీ కార్ల కంపెనీలో.. కలర్‌ కాంబినేషన్‌ కారణంగా కొన్ని కార్లు ఏటా మిగిలిపోతుంటాయి. అంటే.. ప్రతీ బ్రాండ్‌లో కొన్ని కలర్లకే డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. కొన్ని కలర్స్‌ అస్సలు అమ్ముడు కావు. అలాంటి కార్లను తర్వాతి ఏడాది కంపెనీలు 30 నుంచి 35 శాతం డిస్కౌంట్‌పై విక్రయిస్తుంటాయి. కొన్ని కంపెనీలు 40 శాతం కూడా డిస్కౌంట్‌ ఇస్తాయి. కలర్‌ కారణంగా సేల్‌ కానీ, సేల్స్‌ పడిపోయిన కార్లకు మాత్రమే ఈ డిస్కౌంట్‌ వర్తిస్తుంది.

ఈ రెండు అడగాలి..
కలర్‌ కారణంగా అమ్ముడు పోని కార్లు డిస్కౌంట్‌పై కొనేవారు.. మరో రెండు బెనిఫిట్స్‌ కూడా పొందే అవకాశం ఉంటుంది. అందులో ఒకటి ఎక్స్‌ట్రా ఇన్సూరెన్స్‌. సాధారణంగా కొత్త కార్లకు కంపెనీలు వన్‌ ఇయర్‌ ఇన్సూరెన్స్‌ ఇస్తాయి. కానీ అమ్ముడు పోని కార్లపనై మనం రెండేళ్ల వరకు ఇన్సూరెన్స్‌ అడగవచ్చు. కంపెనీలు కూడా ఇస్తాయి. ఇక రెండో బెనిఫిట్‌ ఏమిటంటే.. ఫుల్‌ చెకప్‌. ఎందుకంటే.. తక్కువ ధరకు కొంటున్నాం కాబట్టి కారులో ఏదైనా లోపం ఉందా.. సెకండ్‌ హ్యాండ్‌ కారా అన్న అనుమానాలు ఉంటాయి. అందుకే కంపెనీ మనక కారును మరోసారి ఫుల్‌గా చెక్‌చేసి ఇస్తుంది.

తక్కువ వడ్డీతో రుణం కూడా..
ఇక కలర్‌ కారణంగా అమ్ముడు కాని కార్లపై కూడా కొన్ని ఫైనాన్స్‌ కంపెనీలు రుణాలు ఇస్తుంటాయి. అయితే.. ఇలాంటి కారు కొనేవారు డైరెక్ట్‌ క్యాష్‌ పేమెంట్‌ చేయడం బెటర్‌. దీని ద్వారా ఎక్కువ డిస్కౌంట్‌ పొందే అవకాశం ఉంటుంది. అలా వీలుకానివారు. తక్కువ వడ్డీ ఇచ్చే ఫైనాన్స్‌ కంపెనీల ద్వారా లోన్‌ పొందవచ్చు. కారు గురించి తెలిపి.. లో ఇంట్రెస్ట్‌ లోన్‌ పొందే అవకాశం కూడా ఉంటుంది.

సో.. ఇంకా ఆలస్యం చేయకండి. మీదగ్గర్లో ఉన్న షోరూంలకు వెళ్లండి. కలర్‌ కాంబినేషన్‌ కారణంగా అమ్ముడి కాని కారు గురించి తెలుసుకోండి. అందులో మీకు కావాల్సిన బ్రాండ్‌ ఉందో లేదో తెలుసుకోండి. ఎంత డిస్కౌంట్‌ వస్తుందో కూడా తెలుసుకోండి. నచ్చితే కొనేయండి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version