New Car Offers : కారు.. ఒకప్పుడు సంపన్నులకే పరిమితం.. కానీ నేడు మిడిల్ క్లాస్ డ్రీమ్. ఇష్టమైన కారు కొనాలని కలలు కంటుంటారు. ఇందుకోసం డబ్బులు పొదుపు చేసే ప్రయత్నం చేస్తుంటారు. కానీ, కొంతమంది మాత్రమే నెరవేర్చుకుంటున్నారు. చాలా మందికి అది కలగానే మిగిలిపోతోంది. కానీ ఈ విషయం తెలిస్తే మీరూ తక్కువ ధరకు, అప్పు లేకుండా, భారీ డిస్కౌంట్‌తో కొత్త కారు కొనుగోలు చేయవచ్చు. అదేంటో తెలుసుకుందాం.
మీకు నచ్చిన కారు సెలక్ట్ చేసుకోండి..
ఈ ఆఫర్‌తో మీకు నచ్చిన కారు కొనుగోలు చేయవచ్చు. మీకు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక డిస్కౌంట్ అయితే మామూలుగా ఉండదు. 25 శాతం నుంచి 30 శాతం వరకు డిస్కౌంట్ వస్తుంది. ఇక ఈ ఆఫర్ పండుగల వేళ మాత్రమే ఉండదు. ఏడాదంతా ఈ ఆఫర్ ఉంటుంది. మీరు ఏ బ్రాండ్ కావాలో సెలక్ట్ చేసుకోవడమే ఆలస్యం.
ఈ ట్రిక్ తెలుసుకోండి…
మీరు రూ.10 లక్షల కారు కొనాలనుకుంటే.. దానిపై 30 శాతం డిస్కౌంట్ వస్తుంది. కానీ, ఈ విషయం ఏ షోరూం వాళ్లు మనకు చెప్పరు. ఈ ట్రిక్ తెలుసుకుంటే.. మీరూ భారీ డిస్కౌంట్‌తో కొత్త కారు మీ సొంతం చేసుకోవచ్చు. అదేంటంటే.. ప్రతీ కార్ల కంపెనీలో.. కలర్ కాంబినేషన్ కారణంగా కొన్ని కార్లు ఏటా మిగిలిపోతుంటాయి. అంటే.. ప్రతీ బ్రాండ్‌లో కొన్ని కలర్లకే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని కలర్స్ అస్సలు అమ్ముడు కావు. అలాంటి కార్లను తర్వాతి ఏడాది కంపెనీలు 30 నుంచి 35 శాతం డిస్కౌంట్‌పై విక్రయిస్తుంటాయి. కొన్ని కంపెనీలు 40 శాతం కూడా డిస్కౌంట్ ఇస్తాయి. కలర్ కారణంగా సేల్ కానీ, సేల్స్ పడిపోయిన కార్లకు మాత్రమే ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది.
ఈ రెండు అడగాలి..
కలర్ కారణంగా అమ్ముడు పోని కార్లు డిస్కౌంట్‌పై కొనేవారు.. మరో రెండు బెనిఫిట్స్ కూడా పొందే అవకాశం ఉంటుంది. అందులో ఒకటి ఎక్స్‌ట్రా ఇన్సూరెన్స్. సాధారణంగా కొత్త కార్లకు కంపెనీలు వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఇస్తాయి. కానీ అమ్ముడు పోని కార్లపనై మనం రెండేళ్ల వరకు ఇన్సూరెన్స్ అడగవచ్చు. కంపెనీలు కూడా ఇస్తాయి. ఇక రెండో బెనిఫిట్ ఏమిటంటే.. ఫుల్ చెకప్. ఎందుకంటే.. తక్కువ ధరకు కొంటున్నాం కాబట్టి కారులో ఏదైనా లోపం ఉందా.. సెకండ్ హ్యాండ్ కారా అన్న అనుమానాలు ఉంటాయి. అందుకే కంపెనీ మనక కారును మరోసారి ఫుల్‌గా చెక్‌చేసి ఇస్తుంది.
తక్కువ వడ్డీతో రుణం కూడా..
ఇక కలర్ కారణంగా అమ్ముడు కాని కార్లపై కూడా కొన్ని ఫైనాన్స్ కంపెనీలు రుణాలు ఇస్తుంటాయి. అయితే.. ఇలాంటి కారు కొనేవారు డైరెక్ట్ క్యాష్ పేమెంట్ చేయడం బెటర్. దీని ద్వారా ఎక్కువ డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది. అలా వీలుకానివారు. తక్కువ వడ్డీ ఇచ్చే ఫైనాన్స్ కంపెనీల ద్వారా లోన్ పొందవచ్చు. కారు గురించి తెలిపి.. లో ఇంట్రెస్ట్ లోన్ పొందే అవకాశం కూడా ఉంటుంది.
సో.. ఇంకా ఆలస్యం చేయకండి. మీదగ్గర్లో ఉన్న షోరూంలకు వెళ్లండి. కలర్ కాంబినేషన్ కారణంగా అమ్ముడి కాని కారు గురించి తెలుసుకోండి. అందులో మీకు కావాల్సిన బ్రాండ్ ఉందో లేదో తెలుసుకోండి. ఎంత డిస్కౌంట్ వస్తుందో కూడా తెలుసుకోండి. నచ్చితే కొనేయండి.