Car company announces: ఇయర్ ఎండింగ్ అనగానే చాలా మంది యూత్ పండుగ వాతావరణంలా ఫీలవుతారు. డిసెంబర్ 31 రోజున బిగ్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు. కొంత మంది తమ అలవాట్లను ఇయర్ ఎండింగ్ లో వదిలేని కొత్త సంవత్సరం నుంచి కొత్త అలవాట్లు చేసుకోవాలని అనుకుంటారు. మరికొందరు ఏదైనా పనిని ప్రారంభించాలనుకుంటే కొత్త సంవత్సరాన్ని ఎంపిక చేసుకుంటారు. అయితే ఇయర్ ఎండింగ్ అంటే ఆటోమోబైల్ రంగానికి కూడా ఒక ఫెస్టివెల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సమయంలో కొన్ని కార్లపై భారీగా తగ్గింపును ప్రకటించి అత్యధిక సేల్స్ చేసుకుంటాయి. వినియోగదారులను ఆకర్షించడానికి పలు ఆఫర్లతో పాటు డిస్కౌంట్లను ప్రకటిస్తారు. తాజాగా రెనాల్ట్ కంపెనీకి చెందిన మూడు కార్లపై భారీగా ఆఫర్లు ప్రకటించారు. ఆవివరాల్లోకి వెళితే..
రెనాల్ట్ కంపెనీ నుంచి రిలీజ్ అయిన కార్లను వినియోగదారులు ఆదరిస్తూ ఉంటారు. దీని నుంచి మార్కెట్లోకి వచ్చిన క్విడ్, కిగర్, ట్రైబర్ లు ఫేమస్ గా నిలిచాయి. అయినా వీటిపై తాజాగా కంపెనీ తగ్గింపు ధరలను ప్రకటించింది. ఇయర్ ఎండింగ్ పేరుతో ఈ కార్లపై ఇచ్చిన ఆఫర్లకు వినియోగదారులు ఇంప్రెస్ అవుతున్నారు. రెనాల్ట్ కిగర్ 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ పై 18.24 నుంచి 20.5 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంటుంది. ఈ కారు డిజైన్ అట్రాక్టివ్ గా ఉంటుంది. ఈ కారు ప్రస్తుతం రూ. 5.99 లక్షలకు విక్రయిస్తున్నారు. దీనిపై రూ. 75,000 తగ్గింపును ప్రకటించారు. ఇందులో రూ.40,000 నగదు డిస్కౌంట్ ఉండగా.. రూ.15 వేలు ఎక్చేంజ్ ఆఫ్ర్, రూ.20 వేలు లాయల్టీ క్యాష్ తగ్గింపును ప్రకటించారు.
ఇదే కంపెనీ నుంచి బెస్ట్ హ్యాచ్ బ్యాక్ అని పేరు తెచ్చుకున్న క్విడ్ ను భారత్ లో ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ కారులో 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 21.46 నుంచి 22.3 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో క్విడ్ ను రూ.4.69 లక్షలకు విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ వేరియంట్ రూ.6.45 లక్షల వరకు విక్రయించనున్నారు. దీనిపై రూ.45,000 తగ్గింపును ప్రకటించారు. ఇందులో రూ.20,000 క్యాష్ డిస్కౌంట్, రూ.15,000 ఎక్చేంజ్ ఆఫర్, రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి.
రెనాల్ట్ కు చెందిన మరో కారు ట్రైబర్ ను కూడా ఇండియాలో ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ కారు ప్రస్తుతం మార్కెట్లో రూ.5.99 లక్షల నుంచి రూ.8.12 లక్షల వరకు విక్రయిస్తున్నారు. దీనిపైూ రూ.60,000 తగ్గింపును ప్రకటించారు. ఇందులో రూ.25,000 క్యాష్ తగ్గింపు, రూ.15,000 ఎక్చేంజ్ ఆఫర్, రూ.20,000 కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. ఎస్ యూవీ వేరియంట్ లో ఉన్న ఈకారులో 7 గురు సురక్షితంగా ప్రయాణం చేయొచ్చు. విశాలమైన బూట్ స్పేస్ కలిగిన ఇది లీటర్ పెట్రోల్ కు 20 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. కొత్తగా కారు కొనాలని అనుకునేవారు.. తగ్గింపులో కొత్త వెహికల్ ను సొంతం చేసుకోవాలని అనుకునేవారు ఈ సమయంలో కారును కొనుగోలు చేసి తగ్గింపు ధరను పొందవచ్చు.