Bajaj Pulsar 220F 2026: భారతీయ యువతను బజాజ్ పల్సర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సిరీస్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ ‘పల్సర్ 220F’ (Pulsar 220F)..ఇప్పుడిది సరికొత్త అప్‌డేట్‌లతో మార్కెట్లోకి వచ్చింది. దాదాపు రెండు దశాబ్దాలుగా తన ఐకానిక్ లుక్‌తో బైక్ ప్రియులను అలరిస్తున్న ఈ మోడల్‌కు బజాజ్ ఆటో ఎట్టకేలకు పూర్తి స్థాయి మోడ్రన్ టచ్ ఇచ్చింది. వాహనదారుల నుంచి ఎప్పటినుంచో వస్తున్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని, ఈ బైక్‌లో సరికొత్త మార్పులు చేసింది. ఆ మార్పులేవో చూద్దాం..
కొత్తగా వచ్చే పల్సర్ బైక్ లో అత్యంత కీలకమైన మార్పు బైక్ ముందు భాగంలో ఉన్న పాత హాలోజన్ ట్విన్-హెడ్‌లాంప్ సెటప్ స్థానంలో సరికొత్త LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్ యూనిట్‌ను అమర్చారు. దీనితో పాటు కనుబొమ్మల డిజైన్‌లో ఉండే ఆకర్షణీయమైన LED DRLs, ఆటో-ఆన్ ఫంక్షనాలిటీని కూడా అందించారు. ఇదివరకే అందించిన ఎల్‌ఈడీ ఇండికేటర్లతో కలిపి ఇప్పుడు ఈ బైక్ పూర్తి స్థాయి ఎల్‌ఈడీ లైటింగ్ సెటప్‌తో మరింత ప్రీమియంగా కనిపిస్తోంది. అయితే, బైక్ ఐకానిక్ సెమీ ఫెయిర్డ్ బాడీ స్ట్రక్చర్, సైడ్ లుక్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు.
ఫీచర్ల పరంగా మార్పులు చేసినప్పటికీ.. మెకానికల్ పరంగా బజాజ్ ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో నమ్మకమైన 220cc సింగిల్ సిలిండర్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ను అలాగే కొనసాగించారు. ఇది 20.9 HP గరిష్ట శక్తిని, 18.6 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ను 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. రైడింగ్ పరంగా పాత పల్సర్ 220F ఇచ్చే అదే పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ మరియు లాంగ్-రైడ్ కంఫర్ట్‌ను ఈ కొత్త మోడల్ కూడా అందిస్తుంది.
కొత్త పల్సర్ 220Fలో రైడర్లకు అవసరమైన ఆధునిక సాంకేతికతను జోడించారు. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్/మెసేజ్ అలర్ట్స్, రెండు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లతో పాటు సింగిల్-ఛానల్ ABS సిస్టమ్ ను అమర్చారు. ఇప్పటి వరకు పల్సర్ బ్లూ,బ్లాక్ కలర్లలో ఎక్కువగా చూశారు. అయితే ఈ కొత్త బైక్ బ్లాక్ గోల్డ్, బ్లాక్ చెర్రీ రెడ్, బ్లాక్ ఇంక్ బ్లూ మరియు బ్లాక్ కాపర్ బీజ్ అనే నాలుగు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
కొత్త ఫీచర్ల అప్‌డేట్ కారణంగా ఈ బైక్ ధరను బజాజ్ ఆటో స్వల్పంగా పెంచింది. ఈ సరికొత్త బజాజ్ పల్సర్ 220F ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.36 లక్షల ( ఎక్స్ షోరూం ) నుండి ప్రారంభమవుతుంది. పాత హాలోజన్ మోడల్‌తో పోలిస్తే ఇది సుమారు రూ. 8,000 వరకు ఎక్కువ. అయినప్పటికీ, పల్సర్ 220F బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ మరియు ఇప్పుడు తోడైన మోడ్రన్ ఎల్‌ఈడీ ఫీచర్ల కారణంగా ఈ ధర సమంజసమేనని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి
