WhatsApp Green Dot Feature: మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ చాటింగ్ తప్పనిసరిగా చేస్తారు. అయితే ఈ యాప్ వినియోగదారులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతోంది. లేటేస్ట్ గా వినియోగదారుల కోసం ఈ యాప్ మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం చాటింగ్‌ను మరింత సులభతరం చేసేందుకు ‘గ్రీన్ డాట్’ (Green Dot) అనే ఆన్‌లైన్ ఇండికేటర్ ఫీచర్‌ను సంస్థ పరీక్షిస్తోంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే… ఎలాంటి లాభాలు ఉంటాయో తెలుసుకుందాం..
వాట్సాప్ ఉపయోగించిన సమయంలో చాటింగ్ చేస్తేనే.. ఆన్ లైన్ లో ఎవరు ఉన్నారో తెలుసుకోవచ్చు. కానీ వారు ఎలాంటి చాటింగ్ చేయకున్నా.. ఆన్ లోన్ లో ఉన్నారా? లేదా? అనేది ఈ కొత్త ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చు. దీనినే ‘గ్రీన్ డాట్’ అని అంటారు. ఇప్పటి వరకు ఒక వ్యక్తి ఆన్ లైన్ లో ఉన్నారని తెలుసుకోవడానికి వారి చాట్ విండోను ఓపెన్ చేసి, పేరు కింద ‘online’ అని వచ్చే వరకు వేచి చూడాల్సి వస్తోంది. అయితే ఈ కొత్త అప్‌డేట్ ప్రకారం.. కాంటాక్ట్ లిస్ట్‌లో లేదా చాట్ ఇన్‌ఫో స్క్రీన్‌లో ఆన్‌లైన్ లో ఉన్న యూజర్ల ప్రొఫైల్ ఫొటో (DP) పై ఒక చిన్న పచ్చటి చుక్క (Green Dot) కనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మెసెంజర్‌లలో ఉండే తరహాలోనే ఈ ఫీచర్‌ను వాట్సాప్ కూడా డిజైన్ చేసింది. దీనివల్ల అవతలి వ్యక్తి అందుబాటులో ఉన్నారని చూడగానే అర్థమైపోతుంది.
ఈ ఫీచర్‌తో పాటు వాట్సాప్ ఒక ప్రత్యేకమైన సెక్షన్‌ను కూడా తీసుకురానుంది. ఇందులో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఉన్నవారితో పాటు, ఇటీవలి కాలంలో యాక్టివ్‌గా ఉన్న వారి పేర్లు కూడా ఒక ప్రత్యేకమైన జాబితా రూపంలో కనిపిస్తాయి. దీనివల్ల మనకు అత్యవసరమైన మెసేజ్‌లు పంపాలనుకున్నప్పుడు, వెంటనే స్పందించే అవకాశం ఉన్న కాంటాక్ట్స్‌ను సులభంగా గుర్తించి చాటింగ్ ప్రారంభించవచ్చు.ఈ కొత్త ఫీచర్ వల్ల వినియోగదారుల ప్రైవసీ (వ్యక్తిగత గోప్యత) కి ఎలాంటి భంగం కలగకుండా వాట్సాప్ తగిన జాగ్రత్తలు తీసుకుంది.
ప్రస్తుతం ఈ సరికొత్త ‘గ్రీన్ డాట్’ ‘రీసెంట్లీ ఆన్‌లైన్’ ఫీచర్లు ఆండ్రాయిడ్ గూగుల్ ప్లే బీటా వెర్షన్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అక్కడ టెస్టింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన తర్వాత, రాబోయే కొన్ని వారాల్లో సాధారణ ఆండ్రాయిడ్, ఐఓఎస్ (iOS) వినియోగదారులందరికీ స్టేబుల్ అప్‌డేట్ ద్వారా ఇది అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
