Mutual Funds : ప్రస్తుతం మనం కేవలం నాలుగు లక్షల పెట్టుబడితో 20 లక్షలు ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనలో చాలామంది తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వాళ్లు చాలా పథకాలలో పెట్టుబడి కూడా పెడతారు. అయితే బ్యాంకులలో కానీ పోస్ట్ ఆఫీస్ పథకాలలో కానీ పెట్టుబడి పెట్టినట్లయితే మీ పెట్టుబడులు పెరగవు. ఇటువంటి సమయంలో మీకు మ్యూచువల్ ఫండ్స్ ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. వీటిలో మీరు సరిగ్గా ప్లాన్ చేసుకుంటే మీరు అనుకున్న ఆదాయం పొందవచ్చు. గత ఐదేళ్ల నుంచి పది రకాల ఫండ్స్ పెట్టుబడిదారులకు ఊహించని రీతిలో రాబడులను తెచ్చిపెట్టాయి.
Also Read : క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పనులు మాత్రం పొరపాటున కూడా చేయకండి
సమయస్ఫూర్తి, మార్కెట్ అవగాహన మరియు సరైన పద్ధతిలో ప్లాన్ చేసుకున్న ప్రకారం పెట్టుబడి పెడితే మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు. ఎలాంటి పనులు తక్కువ సమయంలో ఎక్కువ రాబడిని ఇస్తాయి, ఎలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్స్ లో చాలా రకాలు ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ లో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అని కూడా ఉంటుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది మీకు పెద్ద కంపెనీలు, మధ్యస్థాయి కంపెనీలు అలాగే చిన్న కంపెనీల్లో అన్నిటిలో కూడా మీకు పెట్టుబడి పెట్టే స్వేచ్ఛను కలిగిస్తుంది. మార్కెట్ పరిస్థితులను బట్టి ఫండ్ మేనేజర్ ను మీ పెట్టుబడి పునవిభజన చేసే అవకాశం కూడా ఇందులో ఉంటుంది. ఈ క్రమంలో ఇందులో పెట్టుబడి పెట్టిన వారికి మెరుగైన రాబడి లభిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ మీకు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ గ్యాప్ కంపెనీ ఇలా స్టాక్స్ లో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని కల్పిస్తుంది.
మార్కెట్ పరిస్థితిలను బట్టి ఫండ్ మేనేజర్లు వివిధ రంగాలు లేదా కంపెనీలలో పెట్టుబడులను మారుస్తూ ఉంటారు. ఉదాహరణకు చెప్పాలంటే మీరు పెట్టిన పెట్టుబడి ఒక రంగంలో పనితీరు తగ్గినప్పుడు ఆ రంగం నుంచి బయటకు వచ్చి ఫండ్ మేనేజర్ మంచి పనితీరు ఉన్న మరొక రంగంలో పెట్టుబడి చేస్తారు. దీని కారణంగా పెట్టుబడిదారులకు రిస్కు తగ్గుతుంది మరియు అత్యధిక రాబడిని అందుకుంటారు. గత ఐదు ఏళ్లలో మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 35.88% వార్షిక రాబడిని అందించడం జరిగింది. ప్రస్తుతం ఇది అగ్రస్థానంలో ఉంది.