Motorola Ultra Slim 5G: ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మొబైల్ ఎప్పటికప్పుడు కొత్తదనం ఉండాలని చాలామంది కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కంపెనీలు సైతం ఫీచర్లను, కెమెరా, బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతూ వినియోగదారుల అవసరాలను తీరుస్తున్నారు. నేటి కాలంలో కెమెరా ప్రధానంగా ఉండే మొబైల్ కు ఎక్కువగా ఆదరణ ఉంది. అలాగే రోజంతా ఎక్కువసేపు మొబైల్ పైనే ఆధారపడి ఉండాల్సి రావడంతో బ్యాటరీ సామర్థ్యం ఎక్కువగా ఉన్న డివైస్ లకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో Motorola కంపెనీకి చెందిన ఓ మొబైల్ కెమెరా, బ్యాటరీ వ్యవస్థలో అద్భుతమైన పనితీరును కనిపిస్తోంది. దీంతో ఈ ఫోన్ గురించి తెలుసుకొని ఏం ఫోన్ రా మామ.. అని ఆశ్చర్యపోతున్నారు. మరి ఇందులో ఎలాంటి కెమెరా, బ్యాటరీ వ్యవస్థ ఉందో చూద్దాం..
ప్రతి మొబైల్ లో యూత్ తో పాటు ఫోటోగ్రఫీ కోరుకునే వారు కెమెరాను ప్రధానంగా చూస్తున్నారు. అయితే ఇప్పటివరకు 50, 100 MP తో ఉండే కెమెరా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు కొత్తగా Motorola Ultra Slim 5G అనే మొబైల్ లో ఏకంగా 300 మెగాపిక్ సెల్ ను అమర్చారు. ఇది హై రిజల్యూషన్ తోపాటు అసాధారణమైన ఫోటోగ్రఫీని అందిస్తుంది. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వారికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. పోర్ట్రైట్ నుంచి ల్యాండ్ స్కేప్ వరకు ఎలా కావాలంటే అలా ఫోటోలను ఇవ్వగలదు.
నేటి తరం వినియోగదారులకు ఆకర్షించే విధంగా డిజైన్ ను అమర్చారు. గతంలో కంటే ఈ ఫోన్ బాగా సన్నగా కనిపిస్తూ టెంప్ట్ చేస్తుంది. ప్రీమియం ఫోన్ ను తలపించేలా ఉండే ఇందులో డిస్ప్లే ఆకర్షణీయంగా ఉండనుంది. స్మూత్ స్క్రోలింగ్ తో పాటు వీడియోలు చూడడానికి కంఫర్ట్ గా ఉంటుంది. యూజర్స్ కు ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా కంటెంట్ ను కంటిన్యూ చేయడానికి సౌకర్యాన్ని అందిస్తుంది.
ఇందులో ప్రధానంగా బ్యాటరీ గురించి చెప్పుకోవచ్చు.8000mAh బ్యాటరీని అమర్చారు. ఎక్కువసేపు మొబైల్ వినియోగించే వారికి.. ఫోటోలు, వీడియోలు ఎక్కువగా క్యాప్చర్ చేసేవారికి బ్యాటరీ వ్యవస్థ సపోర్ట్ గా ఉంటుంది. రోజంతా వినియోగించినా కూడా.. డౌన్ టైం తక్కువగా ఉంటుంది. ప్రయాణం చేసేవారికి.. ఇతర కార్యకలాపాలకు ఈ బ్యాటరీ బెస్ట్ ఆప్షన్ అని అనుకోవచ్చు. అయితే బ్యాటరీ చార్జింగ్ కావడానికి ఇందులో 130 వాట్ సెటప్ చేశారు. ఇది సూపర్ ఫాస్టింగ్ చార్జింగ్ అయ్యే టెక్నాలజీ ఉంది. బిజీ షెడ్యూల్ ఉన్నవారికి తొందరగా చార్జింగ్ కావడానికి ఈ చార్జింగ్ అనుగుణంగా ఉంటుంది.
ఇందులో 5g కనెక్టివిటీ వేగవంతంగా ఉండడంతో ఏ ప్రాంతంలోకి వెళ్లిన.. వెంటనే ప్రతిస్పందించే విధంగా సాఫ్ట్వేర్ను అమర్చారు. వినియోగదారులు తమకు కావలసిన ఫైల్స్ అప్లోడ్, డౌన్లోడ్ చేసుకోవడానికి మెరుగైన పనితీరును కనపరుస్తుంది.